Breaking News

విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు!

హైదరాబాద్ / మధిర: సంక్షేమ పథకాలు ‘ఉచితాలు’ (Freebies) కావు.. అవి ప్రజల భవిష్యత్తు కోసం ప్రభుత్వం పెట్టే పెట్టుబడులు అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మధిర నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను (Centralized Community Kitchen) సోమవారం ఆయన ప్రారంభించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించినట్లే.. పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాల సామాజిక, ఆర్థిక పురోగతి కోసం ప్రభుత్వం…

Read More

విద్యాశాఖను యువ నాయకుడికి అప్పగించండి: సీఎం రేవంత్‌ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు డిమాండ్!

హైదరాబాద్: తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు (N. Ramchander Rao) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వెంటనే విద్యాశాఖ బాధ్యతల నుంచి తప్పుకుని, ఆ శాఖను ఏదైనా ఒక యువ నాయకుడికి అప్పగించాలని సోమవారం డిమాండ్ చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థ వ్యతిరేక, సమాజ వ్యతిరేక పాలన సాగిస్తోందని ఆయన ఆరోపించారు. రామచందర్ రావు…

Read More

భీంగల్ మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం

భీంగల్, జూలై 27: (E6 tv NEWS, T, గంగాధర్) భీంగల్ మున్సిపాలిటీలో ఔట్‌సోర్సింగ్ విధానంలో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్న కోట నర్సయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో, ఆయన కుటుంబ సభ్యులను మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి, మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్, కౌన్సిలర్లు పరామర్శించారు. ఈ సందర్భంగా నర్సయ్య అంత్యక్రియల నిర్వహణ కోసం మున్సిపాలిటీ తరఫున రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. మృతుడి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వారు, కుటుంబానికి అండగా ఉంటామని…

Read More

జై జవాన్ – జై కిసాన్ – జై యువా’.. సీఎం రేవంత్ రెడ్డి కొత్త నినాదం!

హైదరాబాద్: దేశంలో యువత నాయకత్వ పటిమను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ‘జై జవాన్ – జై కిసాన్ – జై యువా’ అనే కొత్త నినాదాన్ని ప్రతిపాదించారు. చట్టసభల్లో Gen Z మరియు యువతకు భాగస్వామ్యం కల్పించేందుకు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గిస్తూ రాజ్యాంగ సవరణ చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు….

Read More

కార్యకర్తలు ఇచ్చిన రక్తాన్ని బిఆర్‌ఎస్‌ ఎవరికి అమ్ముకుంది?: సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు!

హైదరాబాద్: బిఆర్‌ఎస్‌ (BRS) పార్టీ నిర్వహించిన రక్తదాన శిబిరాలపై సీఎం ఎ. రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కార్యకర్తల నుంచి సేకరించిన రక్తాన్ని బిఆర్‌ఎస్ నాయకులు ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్‌లకు అమ్ముకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం విలేకరులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ కార్యకర్తలతో రక్తం ఇప్పించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు లేదా కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎందుకు రక్తం ఇవ్వలేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు &…

Read More

తెలంగాణలో 1.05 కోట్ల కుటుంబాలకు ‘స్మార్ట్ రేషన్ కార్డ్స్’.. ఆగస్టులో పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం!

హైదరాబాద్: తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని 1.05 కోట్లకు పైగా కుటుంబాలకు క్యూఆర్ కోడ్ (QR Code) సదుపాయంతో కూడిన కొత్త ‘స్మార్ట్ రేషన్ కార్డ్’లను అందుబాటులోకి తేనుంది. ఈ కార్డుల ముద్రణ ప్రక్రియ ఇప్పటికే పూర్తవ్వగా, జిల్లాలకు పంపించే ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం అధికారికంగా ప్రారంభం కానుంది. ఆగస్టు మొదటి వారంలో లేదా ఆగస్టు 15…

Read More

శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్‌లో విషాదం

నలుగురు యువకులు గల్లంతు.. ముగ్గురి మృతదేహాలు లభ్యం – మరొకరి కోసం కొనసాగుతున్న గాలింపు సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య – వర్షాకాలంలో జలాశయాల వద్ద అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి నిజామాబాద్, జూలై 26: E6 tv NEWS: శివ ఠాకూర్. ముప్కాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎస్‌పీ) బ్యాక్‌వాటర్ ప్రాంతంలోని లక్ష్మి కెనాల్‌లో ఆదివారం చోటుచేసుకున్న విషాద ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విహారయాత్రకు వెళ్లిన…

Read More

లింబాద్రిగుట్టలో హైకోర్టు న్యాయమూర్తుల ప్రత్యేక పూజలు

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న న్యాయమూర్తులు – కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు భీంగల్, జూలై 26: (E6 tv NEWS: T, గంగాధర్) భీంగల్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తంగిరాల మాధవి దేవి, జస్టిస్ లక్ష్మణ్ నారాయణ అలిశెట్టి, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్‌తో పాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి ఆలయానికి చేరుకుని శ్రీ లక్ష్మీనరసింహస్వామి…

Read More

పి.ఆర్.సి. బకాయిలు వెంటనే చెల్లించాలి

ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌కు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల వినతి భైంసా, జూలై 26: (E6 tv NEWS: తిరుపతి గౌడ్) రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన పి.ఆర్.సి. బకాయిలు, పెండింగ్ అలవెన్సులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం భైంసాలోని ఎమ్మెల్యే నివాసంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌కు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల జిల్లా సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం తమకు రావాల్సిన పి.ఆర్.సి. బకాయిలు,…

Read More

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో విషాదం

నలుగురు విద్యార్థులు నీటిలో మునిగి ప్రమాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగింపు నిజామాబాద్, జూలై 26: (E6 tv NEWS). నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (ఎస్‌ఆర్‌ఎస్‌పీ) వద్ద ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రాజెక్టు నీటిలో నలుగురు విద్యార్థులు మునిగిపోగా, వారిలో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. మరో ఇద్దరు విద్యార్థులు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది, విపత్తు నిర్వహణ…

Read More