Breaking News

ఏడేళ్ల తర్వాత ఢిల్లీలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్!

8వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కేంద్రమంత్రి జితిన్ ప్రసాద ఘన స్వాగతం పలికారు. భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్న తరుణంలో, దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం జిన్‌పింగ్ చేపట్టిన ఈ భారత పర్యటనకు దౌత్యపరంగా అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో…

Read More

వైద్యుల నిర్లక్ష్యంతోనే మహిళ మృతి….AVIS హాస్పిటల్‌లో విషాదం..

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఏవిస్ హాస్పిటల్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. వెరికోస్ వెయిన్స్ (Varicose Veins) సమస్యకు శస్త్రచికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన ఓ మహిళ.. సర్జరీ జరిగిన మరుసటి రోజే ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది. కుషాయిగూడ రాంపల్లికి చెందిన మంజుల అనే మహిళ వెరికోస్ వెయిన్స్ చికిత్స కోసం జూబ్లీహిల్స్‌లోని ఏవిస్ హాస్పిటల్‌లో చేరారు. ఆమెకు శస్త్రచికిత్స పూర్తయిన మరుసటి రోజే పరిస్థితి విషమించి మృతి చెందారు. వైద్యుల తీవ్ర నిర్లక్ష్యం వల్లే మంజుల…

Read More

RTC ఛార్జీల మోత: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ తీవ్ర ఆగ్రహం!

ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, సామాన్య ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతోందని విమర్శించింది. హైదరాబాద్ నుంచి హన్మకొండ వెళ్లే ఏసీ బస్సు ఛార్జీని ఉదాహరణగా చూపుతూ బీఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆగస్టు 20న రూ.410గా ఉన్న ఈ బస్సు ఛార్జీ, సెప్టెంబర్ 11 నాటికి రూ.570కి చేరిందని ఆరోపించారు….

Read More

దళితులపై వేధింపులు: బిఆర్‌ఎస్, బిజెపిలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ భారీ ర్యాలీ!

దళిత వర్గాలను అవమానిస్తున్నారంటూ బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్, బిజెపిల దళిత వ్యతిరేక చర్యలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించాయి. పాత బస్టాండ్ సెంటర్ లోని సంజీవరెడ్డి భవన్ (డిసిసి కార్యాలయం) నుంచి జిల్లా పరిషత్ కార్యాలయ సెంటర్ లోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం వరకు 1,000 మందికి పైగా పార్టీ కార్యకర్తలు జెండాలు చేతబూని, రెండు…

Read More

తనిఖీల పేరుతో రైస్ మిల్లర్లను వేధించొద్దు

తనిఖీల పేరుతో రైస్ మిల్లర్లను వేధించొద్దు మిల్లింగ్ ఛార్జీ క్వింటాల్‌కు రూ.150కు పెంచాలి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలినిజామాబాద్‌లో రైస్ మిల్లర్ల ధర్నా నిజామాబాద్, సెప్టెంబర్ 12:(E6tv NEWS: శివ ఠాకూర్).తనిఖీల పేరుతో నిజాయితీగా పనిచేస్తున్న రైస్ మిల్లర్లను వేధించవద్దని నిజామాబాద్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ది నిజామాబాద్ డిస్ట్రిక్ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేశాయి. మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిజామాబాద్ ధర్నాచౌక్‌లో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా…

Read More

ఇల్లెందు ఆర్టీసీ బస్టాండ్‌లో షార్ట్ సర్క్యూట్

తప్పిన పెను ప్రమాదం.. పలు రికార్డులు, ఫర్నిచర్ దగ్ధం ఇల్లెందు, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి) ఇల్లెందు ఆర్టీసీ బస్టాండ్‌లో శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. బస్టాండ్ ఆవరణలోని కంట్రోలర్ గదిలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు వ్యాపించాయి. అయితే ఘటన సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కంట్రోలర్ గదిలో ఉన్న పలు రికార్డులు, ఫర్నిచర్, విద్యుత్ పరికరాలు పూర్తిగా దగ్ధమైనట్లు తెలిసింది….

Read More

భీంగల్ కొత్త బస్టాండ్‌లో కంట్రోలర్ లేక ప్రయాణికుల ఇబ్బందులు

బస్సుల రాకపోకలు ఎక్కువగా ఉన్నా పట్టించుకోని ఆర్టీసీ అధికారులు సమయాలు తెలియక ప్రయాణికుల అవస్థలు భీంగల్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) భీంగల్ పట్టణంలోని కొత్త బస్టాండ్‌లో కంట్రోలర్‌ను ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్‌లో రోజూ పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ, బస్సుల సమయాలు, రాకపోకల వివరాలు తెలుసుకునేందుకు కంట్రోలర్ అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. భీంగల్ కొత్త బస్టాండ్ నుంచి వేల్పూర్,…

Read More

బోధన్‌లో 250 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

లారీ డ్రైవర్‌పై కేసు నమోదు బోధన్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) బోధన్ టౌన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 250 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా బియ్యం లోడ్‌తో వెళ్తున్న లారీని (TS16UB3690) అనుమానంతో ఆపి తనిఖీ చేశారు. లారీలో 523 బస్తాల బియ్యం ఉండగా, వాటికి సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు, రవాణా పత్రాలు డ్రైవర్ వద్ద లేకపోవడంతో లారీని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సివిల్ సప్లైస్ అధికారులకు…

Read More

సోమూర్‌లో ఘనంగా ఎడ్ల అమావాస్య వేడుకలు

ఎద్దులను అలంకరించి పూజలు నిర్వహించిన కాశినాథ్ పటేల్ కుటుంబం మద్నూర్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) మండలంలోని సోమూర్ గ్రామంలో ఎడ్ల అమావాస్య (పొలాల పండుగ)ను కాశినాథ్ పటేల్ కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. వ్యవసాయంలో రైతులకు తోడుగా నిలిచే ఎద్దులను రంగురంగుల వస్త్రాలు, తోరణాలు, వివిధ అలంకరణలతో ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎద్దులకు ఆరోగ్యం, రైతులకు పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని పూజలు చేశారు. వ్యవసాయంతో విడదీయరాని అనుబంధం కలిగిన…

Read More

నేడే జిల్లా కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్

కక్షిదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత కొత్తగూడెం, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టుల్లో శనివారం (సెప్టెంబర్ 12) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత తెలిపారు.జిల్లాలోని అన్ని న్యాయస్థానాల పరిధిలో పెండింగ్‌లో ఉన్న రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, మోటార్ వాహన ప్రమాద పరిహారం, కుటుంబ వివాదాలు తదితర కేసులను లోక్…

Read More