Telangana
ఏర్గట్లలో నూతన రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ
ఏర్గట్ల, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి).ఏర్గట్ల మండల కేంద్రంలో శనివారం మండల కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన రేషన్ స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు మొత్తం 1,419 నూతన రేషన్ కార్డులు మంజూరైనట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. వీటి ద్వారా సుమారు 4,200 కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. మండలంలోని ఏర్గట్లకు 550, దోంచందకు 75, గుమ్మిర్యాల్‌కు 150, తడపకల్‌కు 190, బట్టాపూర్‌కు 132,…
బీసీల ఆత్మగౌరవం పెంచేలా చంద్రబాబు పాలన
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం బీసీ రక్షణ చట్టానికి తుదిమెరుగులు దిద్దుతున్నాం: మంత్రి సవిత విజయవాడ, సెప్టెంబర్ 12:(E6tv NEWS ప్రతినిధి). బీసీల ఆత్మగౌరవం పెంచేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. శనివారం విజయవాడ…
గణేష్ ఉత్సవ నిర్వాహకులకు ఉచిత విద్యుత్…సీఎం రేవంత్
హైదరాబాద్ మహా నగరంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ మరియు నిమజ్జన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ ఆవరణలోని శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణేష్‌లతో పాటు జీహెచ్‌ఎంసీ, హైడ్రా కమిషనర్లు, పోలీస్ ఉన్నతాధికారులు మరియు గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి…
ముత్యాలమ్మ తల్లి ఆలయంలో మహా అన్నదానం
పాల్వంచ, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో నెల రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ముగిశాయి. ఈ సందర్భంగా శనివారం ఆలయ ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 44వ డివిజన్ కార్పొరేటర్ వీసంశెట్టి విశ్వేశ్వరరావు, ఆయన సతీమణితో కలిసి మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ…
కృష్ణానదిపై మట్టపల్లి నిమజ్జన ఘాట్‌ను పరిశీలించిన అధికారులు
మఠంపల్లి, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి) సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని కృష్ణానదిపై మట్టపల్లి బ్రిడ్జి వద్ద సెప్టెంబర్ 14 నుంచి 25 వరకు నిర్వహించనున్న వినాయక నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. శనివారం హుజూర్‌నగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గజ్జె చరమంద రాజు ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం అధికారులు మట్టపల్లి బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేయనున్న నిమజ్జన ఘాట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ…
నిజాంసాగర్‌లో విద్యుత్ కోతలపై రైతుల ధర్నా
రోజుకు ఐదారు గంటలే విద్యుత్ సరఫరాపంటలకు నీరందక ఎండిపోయే పరిస్థితి24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ నిజాంసాగర్, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి). మండలంలో విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు జాతీయ రహదారి 161పై ధర్నా చేపట్టారు. వ్యవసాయానికి అవసరమైన స్థాయిలో విద్యుత్ సరఫరా కావడం లేదని, రోజుకు కేవలం ఐదారు గంటలు మాత్రమే విద్యుత్ వస్తుండటంతో మోటార్లు సక్రమంగా పనిచేయడం లేదని రైతులు పేర్కొన్నారు. అప్పులు…
దర్శనానికి సిద్ధమైన 69 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతి!
హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణనాథుడు వినాయక చవితి ఉత్సవాలకు సంపూర్ణంగా సిద్ధమయ్యారు. ఈ ఏడాది 69 అడుగుల భారీ ఎత్తుతో ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా కొలువుదీరి భక్తులకు దర్శనమివ్వనున్నారు. విగ్రహ నిర్మాణ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయని, ఆదివారం నాటికి భక్తుల దర్శనార్థం విగ్రహాన్ని అందుబాటులో ఉంచుతామని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఛైర్మన్ రాజు కుమార్ (సింగరి రాజ్ కుమార్) వెల్లడించారు. విగ్రహ తయారీలో భాగంగా మద్దతుగా వేసిన కర్రలను దశలవారీగా తొలగిస్తూ…
మంత్రి సీతక్కకు ఘన సన్మానం..
గ్రామపంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు గాను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఘనంగా సన్మానించారు. సర్పంచుల సంఘం అధ్యక్షుడు సౌధాని భువనేశ్వర్ (భువన్న) యాదవ్ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది సర్పంచులు, కార్యదర్శులు ప్రజా భవన్‌కు తరలివచ్చి మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కకు పూలదండలు, శాలువాలు, బొకేలతో పాటు భారీ గజమాలతో సత్కరించి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకాలం గ్రామపంచాయతీల సొంత ఆదాయం…
సూర్యాపేటలో కరెంట్ కోసం రైతుల పోరుబాట…
సూర్యాపేట జిల్లాలో వ్యవసాయ విద్యుత్ సమస్య తీవ్ర రూపం దాల్చింది. పంట పొలాలకు అవసరమైన సమయంలో సరిపడా కరెంట్ అందడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. మండల పరిధిలోని ఎర్కారం సబ్‌స్టేషన్ ఎదుట జనగాం రోడ్డుపై రైతులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. రైతుల హఠాత్ ఆందోళనతో జనగాం రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంటలు చేతికి వచ్చే కీలక సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో…
కేసీఆర్‌పై వ్యాఖ్యలకు షాద్‌నగర్ ఎమ్మెల్యే వివరణ..
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివరణ ఇచ్చారు. ఒకరి మరణాన్ని లేదా చావును కోరుకోవడం ఏమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, అలాగే మహిళా మంత్రులపై బీఆర్‌ఎస్ నాయకులు వాడుతున్న అసభ్యకర, కుల ఆధారిత పదజాలాన్ని శంకర్ తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారిని ఉద్దేశించి నీచమైన భాష…

