Breaking News

వరంగల్‌లో ఉబర్ బైక్ (Uber Bike) సేవలు ప్రారంభం.. తొలి రైడ్ ఉచితం!

వరంగల్ / హైదరాబాద్: దేశీయ ప్రముఖ రైడ్-హెయిలింగ్ యాప్ ‘ఉబర్’ (Uber) ఇప్పుడు చారిత్రక నగరమైన వరంగల్‌లో తన ‘ఉబర్ బైక్’ సేవలను అధికారికంగా ప్రారంభించింది. నగరవాసులకు మరింత వేగవంతమైన, చౌకైన మరియు సౌకర్యవంతమైన రవాణా సౌకర్యాన్ని అందించేందుకు ఈ సర్వీసులు దోహదపడతాయని సంస్థ వెల్లడించింది.

ఉద్యోగాలు, చదువులు, దైనందిన అవసరాల కోసం ప్రయాణించే వారికి ఈ బైక్ ట్యాక్సీలు ఎంతో ప్రయోజనకరంగా ఉండటంతో పాటు, స్థానిక డ్రైవర్లకు అదనపు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ముఖ్య విశేషాలు & ఆఫర్లు:

  • మొదటి రైడ్ ఉచితం: వరంగల్‌లో ఉబర్ బైక్ సేవలను ప్రారంభించిన సందర్భంగా.. కొత్త రైడర్లందరికీ మొదటి రైడ్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు ఉబర్ ప్రకటించింది. పరిమిత కాలం పాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
  • భద్రతా ఫీచర్లు: ప్రతి ఉబర్ బైక్ ట్రిప్ భద్రత కోసం డ్రైవర్ రియల్‌టైమ్ ఐడీ చెక్, ఇన్-యాప్ ఎస్‌ఓఎస్ (SOS) బటన్, 24×7 సేఫ్టీ లైన్, షేర్ ట్రిప్ స్టేటస్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లతో కూడి ఉంటుంది.
  • ఉచిత హెల్మెట్ల పంపిణీ: ప్రయాణంలో ప్రాధాన్యత భద్రతకేనని గుర్తించి, ఈ లాంచ్‌లో భాగంగా ఉబర్ సంస్థ ఉచిత హెల్మెట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు అభినందించారు. నగర అభివృద్ధికి ఇలాంటి రవాణా సేవలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

అధికారుల స్పందన:

“దేశవ్యాప్తంగా చిన్న దూరాలకు, ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీకి బైక్ ట్యాక్సీలు నగరవాసులకు ఎంతో నమ్మకమైన ప్రత్యామ్నాయంగా మారాయి. వరంగల్ ప్రజలకు సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తూనే, స్థానికులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు సంతోషంగా ఉంది.” — రిశాంత్ ఘోష్, డైరెక్టర్ – కన్స్యూమర్ & గ్రోత్, ఉబర్ ఇండియా & సౌత్ ఆసియా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *