అమెరికా పౌరులే లక్ష్యంగా నకిలీ కాల్ సెంటర్లు.. సూత్రధారి వికాస్ కుమార్ నిమార్‌ను అరెస్ట్ చేసిన ఈడీ!
హైదరాబాద్: హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల నుంచి నకిలీ కాల్ సెంటర్లు నిర్వహిస్తూ అమెరికా పౌరులను బురిడీ కొట్టించిన ప్రధాన నిందితుడు వికాస్ కుమార్ నిమార్ అలియాస్ మిస్టీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లోని 15కి పైగా ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడికి వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మోసం జరిగిన తీరు & నెట్‌వర్క్: ఈడీ…

