Hyderabad
పినపాక నియోజకవర్గానికి రూ.186 కోట్ల హెచ్‌ఏఎం నిధులు
బీటీ రహదారులు, వంతెనల అభివృద్ధికి భారీగా నిధుల మంజూరు దసరాలోపే పనులు ప్రారంభం.. 15 ఏళ్ల నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్లదే పినపాక, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి) పినపాక నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. నియోజకవర్గంలోని బీటీ రహదారులు, వంతెనలు, బ్రిడ్జిల నిర్మాణం, అభివృద్ధి పనుల కోసం హెచ్‌ఏఎం నిధుల నుంచి సుమారు రూ.186 కోట్లు మంజూరైనట్లు పినపాక ఎమ్మెల్యే తెలిపారు. మంజూరైన నిధులతో నియోజకవర్గంలోని అవసరమైన రహదారులు, వంతెనల అభివృద్ధి…
16వ వార్డులో పారిశుధ్యంపై నిర్లక్ష్యం
అభివృద్ధికి నోచుకోని స్థితిలో వార్డు ప్రజలు: పుల్లూరి ప్రశాంత్ జమ్మికుంట, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి). జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో పారిశుధ్య నిర్వహణపై అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి, సామాజిక కార్యకర్త పుల్లూరి ప్రశాంత్ ఆరోపించారు. వార్డులో వీధులు సక్రమంగా శుభ్రం చేయడం లేదని, రోడ్ల వెంట పెరిగిన పచ్చిక గడ్డిని తొలగించడం లేదని, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం లేదని పేర్కొన్నారు.వార్డులో పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించకపోవడంతో…
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆగ్రహం: బీఆర్ఎస్ ధరణి భూదందా
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో లక్షలాది ఎకరాల భూములను ఆక్రమించిందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. శాసనసభలో 22-ఏ నిషేధిత భూములపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన, ప్రజల భూములు మరియు ఆస్తులకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించడమే తమ కాంగ్రెస్ ప్రభుత్వ రెవెన్యూ సంస్కరణల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ రెవెన్యూ శాఖను తన వద్దే…
రేవంత్ రెడ్డిపై కవిత సంచలన ఆరోపణలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన (TRS) అధినేత్రి కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అవినీతికి పాల్పడుతున్నారని మండిపడిన ఆమె, ఈ నెల 20న ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ‘పాంచజన్య సంకల్ప సభ’ నిర్వహించి ఆయన అవినీతి పాపాల చిట్టాను ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిని ‘బ్లాక్‌మెయిలర్ల సంఘానికి అధ్యక్షుడు’గా అభివర్ణించిన కవిత, గతంలో ఆర్టీఐ చట్టాన్ని ఆసరాగా చేసుకుని రియల్…
ఏర్గట్లలో నూతన రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ
ఏర్గట్ల, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి).ఏర్గట్ల మండల కేంద్రంలో శనివారం మండల కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన రేషన్ స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు మొత్తం 1,419 నూతన రేషన్ కార్డులు మంజూరైనట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. వీటి ద్వారా సుమారు 4,200 కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. మండలంలోని ఏర్గట్లకు 550, దోంచందకు 75, గుమ్మిర్యాల్‌కు 150, తడపకల్‌కు 190, బట్టాపూర్‌కు 132,…
బీసీల ఆత్మగౌరవం పెంచేలా చంద్రబాబు పాలన
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం బీసీ రక్షణ చట్టానికి తుదిమెరుగులు దిద్దుతున్నాం: మంత్రి సవిత విజయవాడ, సెప్టెంబర్ 12:(E6tv NEWS ప్రతినిధి). బీసీల ఆత్మగౌరవం పెంచేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. శనివారం విజయవాడ…
గణేష్ ఉత్సవ నిర్వాహకులకు ఉచిత విద్యుత్…సీఎం రేవంత్
హైదరాబాద్ మహా నగరంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ మరియు నిమజ్జన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ ఆవరణలోని శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణేష్‌లతో పాటు జీహెచ్‌ఎంసీ, హైడ్రా కమిషనర్లు, పోలీస్ ఉన్నతాధికారులు మరియు గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి…
కృష్ణానదిపై మట్టపల్లి నిమజ్జన ఘాట్‌ను పరిశీలించిన అధికారులు
మఠంపల్లి, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి) సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని కృష్ణానదిపై మట్టపల్లి బ్రిడ్జి వద్ద సెప్టెంబర్ 14 నుంచి 25 వరకు నిర్వహించనున్న వినాయక నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. శనివారం హుజూర్‌నగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గజ్జె చరమంద రాజు ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం అధికారులు మట్టపల్లి బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేయనున్న నిమజ్జన ఘాట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ…
నిజాంసాగర్‌లో విద్యుత్ కోతలపై రైతుల ధర్నా
రోజుకు ఐదారు గంటలే విద్యుత్ సరఫరాపంటలకు నీరందక ఎండిపోయే పరిస్థితి24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ నిజాంసాగర్, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి). మండలంలో విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు జాతీయ రహదారి 161పై ధర్నా చేపట్టారు. వ్యవసాయానికి అవసరమైన స్థాయిలో విద్యుత్ సరఫరా కావడం లేదని, రోజుకు కేవలం ఐదారు గంటలు మాత్రమే విద్యుత్ వస్తుండటంతో మోటార్లు సక్రమంగా పనిచేయడం లేదని రైతులు పేర్కొన్నారు. అప్పులు…
దర్శనానికి సిద్ధమైన 69 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతి!
హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణనాథుడు వినాయక చవితి ఉత్సవాలకు సంపూర్ణంగా సిద్ధమయ్యారు. ఈ ఏడాది 69 అడుగుల భారీ ఎత్తుతో ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా కొలువుదీరి భక్తులకు దర్శనమివ్వనున్నారు. విగ్రహ నిర్మాణ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయని, ఆదివారం నాటికి భక్తుల దర్శనార్థం విగ్రహాన్ని అందుబాటులో ఉంచుతామని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఛైర్మన్ రాజు కుమార్ (సింగరి రాజ్ కుమార్) వెల్లడించారు. విగ్రహ తయారీలో భాగంగా మద్దతుగా వేసిన కర్రలను దశలవారీగా తొలగిస్తూ…

