Breaking News

పార్లమెంట్ సమాచారం: నేడు లోక్‌సభ ముందుకు కీలక బిల్లులు, సమితి నివేదికలు!

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో భాగంగా గురువారం లోక్‌సభ అత్యంత కీలకమైన శాసనసభ కార్యకలాపాలు, చర్చలకు వేదిక కానుంది. నేటి సభ అజెండాలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సవరణ బిల్లుతో పాటు వివిధ పార్లమెంటరీ కమిటీల ముఖ్యమైన నివేదికలు చోటుచేసుకున్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సవరణ బిల్లు – 2026 కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నేడు సభలో ‘సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు, 2026’ను చర్చించి ఆమోదించాల్సిందిగా ప్రతిపాదించనున్నారు. 1956 నాటి చట్టాన్ని సవరిస్తూ…

Read More

అన్ని పంటలకు బోనస్ ప్రకటించాలి

ఎల్ ని నో పరిస్థితుల్లో రైతులకు భరోసా కల్పించాలి – అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా పీఎం ఫసల్ బీమా అమలు, నిజాంసాగర్‌కు నీటి సరఫరాపై ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే ఇందూరు, జూలై 20: E6 tv NEWS శివ ఠాకూర్.ఎల్ ని నో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వరి పంటతో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ…

Read More

ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణికి కాలం చెల్లిన మందులా? బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యుల డిమాండ్.

ఒక నెల మందులు ఇవ్వగా 22 రోజుల పాటు వాడినట్లు కుటుంబ సభ్యుల ఆరోపణ తప్పు జరిగిందని వైద్య సిబ్బంది క్షమాపణ చెప్పారని సీతారాం వాదన తల్లి, శిశువుకు ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరు? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కుటుంబ సభ్యులు సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి రుద్రూర్ జులై 19: E6tv NEWS (అశోక్ కాంబ్లే). నిజామాబాద్ జిల్లా రుద్రూరు ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణీకి కాలం చెల్లిన మందులు ఇచ్చారంటూ…

Read More

మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి నివాళులర్పించిన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటి నరసింహ

హైదరాబాద్ (E6TV ప్రతినిధి): సామాజిక విప్లవకారుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, స్త్రీ విద్య కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు హైదరాబాద్‌లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటి నరసింహ పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో నెలకొన్న అసమానతలపై పోరాడి, విద్యావంతులే విముక్తి పొందుతారని నమ్మిన గొప్ప సంస్కర్త పూలే అని…

Read More

E6 న్యూస్ కథనానికి స్పందన, అనుమతులు లేని ఆసుపత్రి పై DMHO అధికారుల చర్యలు.

చట్టపరమైన చర్యలు తీసుకుంటారా లేదా? వేచి చూడాలి మరి. నిజామాబాద్, జూలై 1: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని మహా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రభుత్వ అనుమతులు లేకుండానే గత రెండేళ్లుగా వైద్య సేవలు అందిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోందంటూ E6 న్యూస్ ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు. కథనం ప్రసారమైన అనంతరం సంబంధిత శాఖ అధికారులు ఆసుపత్రిని పరిశీలించి, ఆసుపత్రికి సంబంధించిన బోర్డులు, హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను తొలగించారు. ఈ చర్య స్థానికంగా…

Read More

విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు!

హైదరాబాద్ / మధిర: సంక్షేమ పథకాలు ‘ఉచితాలు’ (Freebies) కావు.. అవి ప్రజల భవిష్యత్తు కోసం ప్రభుత్వం పెట్టే పెట్టుబడులు అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మధిర నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను (Centralized Community Kitchen) సోమవారం ఆయన ప్రారంభించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించినట్లే.. పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాల సామాజిక, ఆర్థిక పురోగతి కోసం ప్రభుత్వం…

Read More

నీట్ పేపర్ లీక్‌పై నిర్మల్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ మైనారిటీ ర్యాలీ

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ నిర్మల్, జూలై 24 E6 tv news Md అమీనుద్దీన్: నీట్ పేపర్ లీక్ ఘటనతో పాటు విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌ను నిరసిస్తూ నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ మైనారిటీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మైనారిటీ నాయకుడు కాంగ్రెస్ కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్ల మాట్లాడుతూ, నీట్ పేపర్ లీక్ కారణంగా దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థుల…

Read More

అనాథాశ్రమం శుభ్రం చేయాలి.. పిల్లలకు పండ్లు పంచాలి: ఎనిమిది మందికి ఎల్బీనగర్ కోర్టు వినూత్న శిక్ష!

హైదరాబాద్: చిన్నచిన్న నేరాలు, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే వారికి ఎల్బీనగర్ లోకల్ కోర్టు వినూత్నమైన, సామాజిక స్పృహ కలిగించే శిక్షను ఖరారు చేసింది. స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో ఎనిమిది మంది నిందితులకు అనాథాశ్రమాన్ని శుభ్రం చేయడంతో పాటు అక్కడి పిల్లలకు పండ్లు పంపిణీ చేయాలని సామాజిక సేవా శిక్ష విధించింది. ఎల్బీనగర్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు మిడ్‌నైట్ టిఫిన్ సెంటర్ నిర్వాహకులతో పాటు రోడ్డుపై న్యూసెన్స్ సృష్టించిన ఆరుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. అనంతరం…

Read More

శ్రీనగర్–జాకోర గ్రామాల్లో 31 సీసీ కెమెరాల ప్రారంభం.

‘ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం’ – పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య. సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణలో ప్రజల అప్రమత్తతే కీలకమని పిలుపు. ‘మన ఊరు–మన భద్రత–మన బాధ్యత’ కార్యక్రమంలో కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యం. వర్ని, జూలై 8: E6 క్రైమ్ (శివ ఠాకూర్).  ప్రజల భద్రతే లక్ష్యంగా చేపట్టిన ‘మన ఊరు–మన భద్రత–మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్, జాకోర గ్రామాల్లో మొత్తం 31 సీసీ…

Read More

ఘనంగా కాకతీయ హిందూ మహా సమ్మేళనం

కులాలు ప్రాంతాలు రాజకీయాలను పక్కనపెట్టి  మనం హిందువులమని భావించి జీవించినప్పుడు మన దేశాన్ని, ధర్మాన్ని, ఆలయాన్ని కాపాడుకోగలమని మాడుగుల శశిభూషణ సోమయాజి గురుజి అన్నారు. ప్రగతి నగర్ కాకతీయ హిందూ మహా సమ్మేళన ఉత్సవ సమితి అధ్యక్షులు పవన్ దొడ్డ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాడుగుల శశిభూషణ సోమయాజి గురూజీ , డాక్టర్ భువనేశ్వరి మారేపల్లి, వాసు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. హిందూ మహాసమ్మేళన ఈ కార్యక్రమంలో చిన్నారుల భరతనాట్యం ,భక్తి పాటలు, హనుమాన్…

Read More