హైదరాబాద్ :
ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన తెలంగాణ శాసనసభ (అసెంబ్లీ) భవనంలో జరుగుతున్న మరమ్మతులు, పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం వ్యక్తిగతంగా పరిశీలించారు.
అసెంబ్లీ ప్రాంగణమంతా కలియతిరిగిన సీఎం, పనుల పురోగతిపై సంబంధిత ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. చారిత్రక కట్టడం యొక్క రూపురేఖలు దెబ్బతినకుండా, అత్యంత నాణ్యతా ప్రమాణాలతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు పలు కీలక సూచనలు జారీ చేశారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, జైవీర్ రెడ్డిలతో పాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

