Breaking News

హైదరాబాద్ మెట్రోకు కేంద్రం నుంచి ₹1,204 కోట్లు.. ఏపీ ప్రాజెక్టులకు సున్నా సహాయం!

హైదరాబాద్ :

తెలంగాణలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) పద్ధతిలో చేపట్టిన హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1 ప్రాజెక్ట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం భారీ నిధులను విడుదల చేసింది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ (DEA) ద్వారా వైయబిలిటీ గ్యాప్ ఫండ్ (VGF) కింద రూ. 1,204 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర పట్నాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ పార్లమెంట్‌లో వెల్లడించారు.

రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ మంత్రి ఈ విషయాలను తెలిపారు.

ఆంధప్రదేశ్ పరిస్థితిపై స్పష్టత:

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎలాంటి మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మాణం లేదా నిర్వహణలో లేదని మంత్రి స్పష్టం చేశారు. అందువల్ల ఏపీకి కేంద్ర ఆర్థిక సహాయం ఏదీ విడుదల కాలేదని తెలియజేశారు.

దేశవ్యాప్తంగా మెట్రో నెట్‌వర్క్ & ప్రయోజనాలు:

  • ప్రస్తుత నెట్‌వర్క్: ప్రస్తుతం దేశంలోని 26 నగరాల్లో ఆర్‌ఆర్‌టిఎస్ (RRTS)తో కలిపి మొత్తం 1159 కిలోమీటర్ల మెట్రో రైల్ నెట్‌వర్క్ అందుబాటులో ఉంది.
  • మెట్రోతో ప్రయోజనాలు: మెట్రో వ్యవస్థల విస్తరణ వల్ల ప్రజలు వ్యక్తిగత వాహనాలను వదిలి ప్రజా రవాణాను ఆశ్రయిస్తారని, దీనివల్ల ట్రాఫిక్ రద్దీ, వాహనాల ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయని మంత్రి పేర్కొన్నారు. అలాగే ప్రయాణ సమయం ఆదా అవ్వడంతో పాటు గ్రీన్ హౌస్ వాయువుల విడుదల కూడా తగ్గుతుందని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *