News
సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి: బీజేపీ డిమాండ్!
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రాణత్యాగాలు చేసిన వీరుల బలిదానాలను గుర్తించి, సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ‘తెలంగాణ విమోచన దినోత్సవం’గా నిర్వహించాలని బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్ డిమాండ్ చేశారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’ చర్యతోనే 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించిందని గుర్తుచేశారు. ఈ పోరాటంలో సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయారని, వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణకు స్వేచ్ఛ…
రైతులకు 18 గంటల విద్యుత్ ఇవ్వాలి: ఎస్‌ఈకి బీజేపీ వినతిపత్రం!
నిజామాబాద్ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. పంట పొలాలు కీలకమైన పొట్ట దశకు చేరుకున్న సమయంలో విద్యుత్ కోతలు విధించడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ (SE)ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో సాగవుతున్న సుమారు…
రూ. 250 కోట్ల హెల్త్ ప్రాజెక్టులు ప్రారంభం: విజయవాడ
ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య రంగ బలోపేతానికి మరో కీలక ముందడుగు పడింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, సీఎం నారా చంద్రబాబు నాయుడుతో కలిసి విజయవాడలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ‘క్రిటికల్ కేర్ బ్లాక్’ను కేంద్ర మంత్రి జేపీ నడ్డా అధికారికంగా ప్రారంభించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అత్యవసర, అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతిక సదుపాయాలతో ఈ కేంద్రాన్ని…
వైద్యుల నిర్లక్ష్యంతోనే మహిళ మృతి….AVIS హాస్పిటల్‌లో విషాదం..
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఏవిస్ హాస్పిటల్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. వెరికోస్ వెయిన్స్ (Varicose Veins) సమస్యకు శస్త్రచికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన ఓ మహిళ.. సర్జరీ జరిగిన మరుసటి రోజే ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది. కుషాయిగూడ రాంపల్లికి చెందిన మంజుల అనే మహిళ వెరికోస్ వెయిన్స్ చికిత్స కోసం జూబ్లీహిల్స్‌లోని ఏవిస్ హాస్పిటల్‌లో చేరారు. ఆమెకు శస్త్రచికిత్స పూర్తయిన మరుసటి రోజే పరిస్థితి విషమించి మృతి చెందారు. వైద్యుల తీవ్ర నిర్లక్ష్యం వల్లే మంజుల…
RTC ఛార్జీల మోత: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ తీవ్ర ఆగ్రహం!
ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, సామాన్య ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతోందని విమర్శించింది. హైదరాబాద్ నుంచి హన్మకొండ వెళ్లే ఏసీ బస్సు ఛార్జీని ఉదాహరణగా చూపుతూ బీఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆగస్టు 20న రూ.410గా ఉన్న ఈ బస్సు ఛార్జీ, సెప్టెంబర్ 11 నాటికి రూ.570కి చేరిందని ఆరోపించారు….
నారపల్లి వివాదం… కాంగ్రెస్ నేతలపై తీవ్ర ఆరోపణలు! కోర్టు
నారపల్లి వివాదం… కాంగ్రెస్ నేతలపై తీవ్ర ఆరోపణలు! కోర్టు ఉత్తర్వులు ఉన్నా కార్యాలయంపై ఆధిపత్యం? అసలు ఎవరి అండ? E6TV ప్రత్యేక కథనం నారపల్లిలో జరుగుతున్న ఈ వివాదం ఇప్పుడు సంచలనంగా మారుతోంది! ఒక ఆస్తి వివాదం… వరుస పోలీస్ ఫిర్యాదులు… కోర్టు కేసులు… హైకోర్టు ఆదేశాలు… అయినా వివాదం ఎందుకు ఆగలేదు? అత్యంత ముఖ్యంగా… ఈ వ్యవహారంలో తమను కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిగా పేర్కొంటున్న వ్యక్తులపై ఫిర్యాదులు రావడం ఇప్పుడు అనేక ప్రశ్నలకు దారితీస్తోంది!…
దళితులపై వేధింపులు: బిఆర్‌ఎస్, బిజెపిలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ భారీ ర్యాలీ!
దళిత వర్గాలను అవమానిస్తున్నారంటూ బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్, బిజెపిల దళిత వ్యతిరేక చర్యలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించాయి. పాత బస్టాండ్ సెంటర్ లోని సంజీవరెడ్డి భవన్ (డిసిసి కార్యాలయం) నుంచి జిల్లా పరిషత్ కార్యాలయ సెంటర్ లోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం వరకు 1,000 మందికి పైగా పార్టీ కార్యకర్తలు జెండాలు చేతబూని, రెండు…
తన పేషీకి ఎలాంటి సంబంధం లేదన్న మంత్రి పొన్నం ప్రభాకర్!
సీఎం ఆర్‌ఎఫ్ (CM Relief Fund) లంచం కేసులో ఏసీబీ (ACB) అధికారులకు పట్టుబడిన ఇద్దరు వ్యక్తులతో తన పేషీకి ఎలాంటి సంబంధమూ లేదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారుడి నుంచి లంచం డిమాండ్ చేస్తూ దొరికిన ఆ నిందితులు తమ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో పనిచేయడం లేదని ఆయన తెలిపారు. ఒక పత్రికలో వచ్చిన వార్తపై మంత్రి ఓఎస్‌డీ (OSD) పులి సైదులు…
తనిఖీల పేరుతో రైస్ మిల్లర్లను వేధించొద్దు
తనిఖీల పేరుతో రైస్ మిల్లర్లను వేధించొద్దు మిల్లింగ్ ఛార్జీ క్వింటాల్‌కు రూ.150కు పెంచాలి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలినిజామాబాద్‌లో రైస్ మిల్లర్ల ధర్నా నిజామాబాద్, సెప్టెంబర్ 12:(E6tv NEWS: శివ ఠాకూర్).తనిఖీల పేరుతో నిజాయితీగా పనిచేస్తున్న రైస్ మిల్లర్లను వేధించవద్దని నిజామాబాద్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ది నిజామాబాద్ డిస్ట్రిక్ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేశాయి. మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిజామాబాద్ ధర్నాచౌక్‌లో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా…
యూట్యూబర్ రమానందనపై మరో కేసు..
లండన్‌లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ. 10.50 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన వ్యవహారంలో ప్రముఖ యూట్యూబర్, ‘నందూస్ వరల్డ్’ ఛానల్ నిర్వహకురాలు రమానందనకు ప్రకాశం జిల్లా పోలీసులు షాక్ ఇచ్చారు. ఈ మోసం కేసుకు సంబంధించి ఈ నెల 17న విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ ఆమెకు నోటీసులు జారీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం పేరాయపాలెంకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి తన కోడలికి లండన్‌లో ఉద్యోగం…

