News
ఏర్గట్లలో నూతన రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ
ఏర్గట్ల, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి).ఏర్గట్ల మండల కేంద్రంలో శనివారం మండల కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన రేషన్ స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు మొత్తం 1,419 నూతన రేషన్ కార్డులు మంజూరైనట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. వీటి ద్వారా సుమారు 4,200 కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. మండలంలోని ఏర్గట్లకు 550, దోంచందకు 75, గుమ్మిర్యాల్‌కు 150, తడపకల్‌కు 190, బట్టాపూర్‌కు 132,…
బీసీల ఆత్మగౌరవం పెంచేలా చంద్రబాబు పాలన
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం బీసీ రక్షణ చట్టానికి తుదిమెరుగులు దిద్దుతున్నాం: మంత్రి సవిత విజయవాడ, సెప్టెంబర్ 12:(E6tv NEWS ప్రతినిధి). బీసీల ఆత్మగౌరవం పెంచేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. శనివారం విజయవాడ…
గణేష్ ఉత్సవ నిర్వాహకులకు ఉచిత విద్యుత్…సీఎం రేవంత్
హైదరాబాద్ మహా నగరంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ మరియు నిమజ్జన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ ఆవరణలోని శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణేష్‌లతో పాటు జీహెచ్‌ఎంసీ, హైడ్రా కమిషనర్లు, పోలీస్ ఉన్నతాధికారులు మరియు గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి…
ముత్యాలమ్మ తల్లి ఆలయంలో మహా అన్నదానం
పాల్వంచ, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో నెల రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ముగిశాయి. ఈ సందర్భంగా శనివారం ఆలయ ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 44వ డివిజన్ కార్పొరేటర్ వీసంశెట్టి విశ్వేశ్వరరావు, ఆయన సతీమణితో కలిసి మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ…
ఎంపీ చామల బీఆర్‌ఎస్ పై తీవ్ర విమర్శలు
బీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన ‘మాక్ అసెంబ్లీ’పై భువనగిరి కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఒక రోజు ముందే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఎల్పీ మీటింగ్ పెట్టి పోలీసులతో పంచాయతీ పెట్టుకుని రండని ఉసిగొల్పారని ఆరోపించారు. శాసనసభకు వచ్చి ప్రజా సమస్యలపై ప్రశ్నించే నైతికతను ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు పూర్తిగా కోల్పోయారని చామల విమర్శించారు. నల్ల టీషర్టులపై పేర్లు రాసుకుని సభకు వస్తే లోపలికి రానివ్వరని…
కృష్ణానదిపై మట్టపల్లి నిమజ్జన ఘాట్‌ను పరిశీలించిన అధికారులు
మఠంపల్లి, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి) సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని కృష్ణానదిపై మట్టపల్లి బ్రిడ్జి వద్ద సెప్టెంబర్ 14 నుంచి 25 వరకు నిర్వహించనున్న వినాయక నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. శనివారం హుజూర్‌నగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గజ్జె చరమంద రాజు ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం అధికారులు మట్టపల్లి బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేయనున్న నిమజ్జన ఘాట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ…
నిజాంసాగర్‌లో విద్యుత్ కోతలపై రైతుల ధర్నా
రోజుకు ఐదారు గంటలే విద్యుత్ సరఫరాపంటలకు నీరందక ఎండిపోయే పరిస్థితి24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ నిజాంసాగర్, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి). మండలంలో విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు జాతీయ రహదారి 161పై ధర్నా చేపట్టారు. వ్యవసాయానికి అవసరమైన స్థాయిలో విద్యుత్ సరఫరా కావడం లేదని, రోజుకు కేవలం ఐదారు గంటలు మాత్రమే విద్యుత్ వస్తుండటంతో మోటార్లు సక్రమంగా పనిచేయడం లేదని రైతులు పేర్కొన్నారు. అప్పులు…
కొండా సురేఖకు ఢిల్లీ నుంచి పిలుపు!
మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన మాజీ మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో తెలంగాణ రాజకీయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి హుటాహుటిన ఢిల్లీకి రావాల్సిందిగా పిలుపు అందింది. వెంటనే బయలుదేరి రావాలని పార్టీ పెద్దల నుంచి ఆమెకు స్పష్టమైన సందేశం వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవల మంత్రి పదవి కోల్పోయిన అనంతరం కొండా సురేఖ తీవ్ర అసంతృప్తితో ఉన్న తరుణంలో, శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆమెతో స్వయంగా…
దర్శనానికి సిద్ధమైన 69 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతి!
హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణనాథుడు వినాయక చవితి ఉత్సవాలకు సంపూర్ణంగా సిద్ధమయ్యారు. ఈ ఏడాది 69 అడుగుల భారీ ఎత్తుతో ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా కొలువుదీరి భక్తులకు దర్శనమివ్వనున్నారు. విగ్రహ నిర్మాణ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయని, ఆదివారం నాటికి భక్తుల దర్శనార్థం విగ్రహాన్ని అందుబాటులో ఉంచుతామని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఛైర్మన్ రాజు కుమార్ (సింగరి రాజ్ కుమార్) వెల్లడించారు. విగ్రహ తయారీలో భాగంగా మద్దతుగా వేసిన కర్రలను దశలవారీగా తొలగిస్తూ…
ఏడేళ్ల తర్వాత ఢిల్లీలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్!
8వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కేంద్రమంత్రి జితిన్ ప్రసాద ఘన స్వాగతం పలికారు. భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్న తరుణంలో, దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం జిన్‌పింగ్ చేపట్టిన ఈ భారత పర్యటనకు దౌత్యపరంగా అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో…

