Breaking News

టీవీకేకు రాష్ట్ర పార్టీ హోదా, ‘విజిల్’ గుర్తు కేటాయింపు

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ సంచలనం సృష్టిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం (ECI) టీవీకేను రాష్ట్ర పార్టీగా అధికారికంగా గుర్తించడంతో పాటు, పార్టీకి ‘విజిల్’ (Whistle) గుర్తును కేటాయించింది. మరోవైపు అక్టోబర్ 6న జరగనున్న ఉప ఎన్నికల కోసం టీవీకే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మదురాంతకం నియోజకవర్గం నుంచి కె. మరగతం కుమరవేల్‌, ధారాపురం నుంచి…

Read More

న్యూఢిల్లీ చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్:18వ బ్రిక్స్ సదస్సు

న్యూఢిల్లీ: 18వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి చేరుకున్నారు. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న పుతిన్‌కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో వ్లాదిమిర్ పుతిన్ కీలక ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొననున్నారు. భారత్-రష్యా మధ్య రక్షణ, ఇంధనం, వాణిజ్యం మరియు వ్యూహాత్మక సంబంధాల బలోపేతంపై ఇరు నాయకులు చర్చించనున్నారు. ఈ…

Read More

సివిల్ సప్లై అధికారుల వేధింపులు ఆపాలి: E6TVతో మాట్లాడిన రైస్ మిల్లర్ల సంఘం డిమాండ్

కామారెడ్డి: సివిల్ సప్లై అధికారుల వేధింపులు వెంటనే నిలిపివేయాలని, సీఎంఆర్ (CMR) బియ్యం చెల్లింపునకు డిసెంబర్ 31 వరకు గడువు పొడిగించాలని ఇంటిగ్రేటెడ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. కామారెడ్డి జిల్లా కోటగిరి మండల కేంద్రంలో పలు మండలాల రైస్ మిల్లర్ల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో సంఘ అధ్యక్షుడు శంకర్ పటేల్, ప్రధాన కార్యదర్శి నిశాంత్ సేట్ మాట్లాడారు. ప్రభుత్వానికి సహకరించే ఉద్దేశంతో నాణ్యత లేని, తడిసిన ధాన్యాన్ని కూడా మిల్లులకు తీసుకుంటున్నామని, దానివల్ల నూక…

Read More

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం

కొత్తగూడెం, సెప్టెంబర్ 11: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద ఆమె చిత్రపటానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ ధైర్యం, ఆత్మగౌరవం, పోరాట పటిమ తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమన్నారు. సామాజిక అన్యాయం, దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా…

Read More

కేటీఆర్, హరీష్ రావుపై కేసులు కక్ష సాధింపే

కాంగ్రెస్ సర్కారుకు మ్యాటర్ వీక్.. పబ్లిసిటీ పీక్ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి: జీవన్ రెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అసెంబ్లీలో బీఆర్ఎస్ పక్ష ఉపనేత హరీష్ రావుపై నమోదైన లైంగిక వేధింపుల కేసులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపులో భాగమేనని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆరోపించారు.గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Read More

తాణకాలాన్‌లో అంగరంగ వైభవంగా ఎడ్ల పొలాల అమావాస్య

ఎడ్లకు, ట్రాక్టర్లకు ప్రత్యేక అలంకరణలు.. గ్రామంలో పండుగ సందడి ఎడపల్లి, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).ఎడపల్లి మండలం తాణకాలాన్ గ్రామంలో ఎడ్ల పొలాల అమావాస్య వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోవడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎడ్ల పొలాల అమావాస్యను పురస్కరించుకుని రైతులు తమ ఎడ్లను, ట్రాక్టర్లను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వ్యవసాయంలో తమకు తోడుగా నిలిచే పశువులు, వ్యవసాయ యంత్రాలకు…

Read More

ఎస్సారెస్పీలో 46 టీఎంసీల నీళ్లున్నా పంటలు ఎండుతున్నాయి

2 లక్షల ఎకరాల పంటలను కాపాడేందుకు 6 టీఎంసీలు విడుదల చేయాలి అన్ని ఎత్తిపోతల పథకాలను పూర్తి సామర్థ్యంతో నడపాలి: వేముల ప్రశాంత్‌రెడ్డి నిజామాబాద్, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ (ఎస్సారెస్పీ)లో సుమారు 46 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ నిజామాబాద్ జిల్లాలో రైతుల పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. సుమారు 2 లక్షల ఎకరాల పంటలను కాపాడేందుకు వెంటనే 6 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని…

Read More

రూ.1.25 లక్షల ఎల్‌ఓసీ అందజేత

ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు ఏర్గట్ల, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన రాయన గంగాధర్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో వైద్య ఖర్చుల కోసం తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్‌కుమార్ దృష్టికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఈరవత్రి అనిల్‌కుమార్ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.1.25 లక్షల ఎల్‌ఓసీని మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు. ఆపద…

Read More

పాల్వంచ–కొత్తగూడెం వేదికగా ఆల్ ఇండియా సీనియర్స్ టెన్నిస్ టోర్నమెంట్

సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు పోటీలు దేశవ్యాప్తంగా 300–400 మంది సీనియర్ క్రీడాకారుల రాక పాల్వంచ, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ–కొత్తగూడెం జంట నగరాల వేదికగా తొలిసారిగా ఆల్ ఇండియా సీనియర్స్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, శ్యామల గోపాలం ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్ నల్ల సురేష్ రెడ్డి సహకారంతో సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు టోర్నమెంట్ జరగనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల…

Read More

ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో పోటీకి ‘సై’

శిల్పినగర్, కేజీబీవీ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం భద్రాచలం ఎంఈఓ బెక్కంటి శ్రీనివాసరావు భద్రాచలం, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తూ విద్యార్థి కేంద్రంగా బోధన అందిస్తున్నామని భద్రాచలం మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాసరావు అన్నారు. శిల్పినగర్ ప్రాథమిక పాఠశాల, కేజీబీవీ భద్రాచలం విద్యార్థులు చురుకుగా, ఉత్సాహంగా విద్యను అభ్యసిస్తూ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో పోటీకి తాము సైతం సిద్ధమంటున్నారని తెలిపారు. గురువారం భద్రాచలం పట్టణంలోని శిల్పినగర్…

Read More