Breaking News

ఇందిరా ప్రియదర్శినికి కాళోజి నంది అవార్డు

కొత్తగూడెం అడ్వకేట్‌కు దక్కిన అరుదైన ఘనతబెస్ట్ జూనియర్ అడ్వకేట్’గా రాష్ట్రస్థాయి గుర్తింపు బెస్ట్ జూనియర్ అడ్వకేట్’గా రాష్ట్రస్థాయి గుర్తింపు పాల్వంచ,సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయవాద రంగానికి మరో విశిష్ట గౌరవం దక్కింది. కొత్తగూడెం పట్టణంలోని ప్యూన్‌బస్తీకి చెందిన అడ్వకేట్ ఇందిరా ప్రియదర్శిని జిల్లా కోర్టు పరిధిలో ప్రతిభ కనబరిచి బెస్ట్ జూనియర్ అడ్వకేట్ గా ఎంపికయ్యారు. అంతేకాకుండా కాళోజి జయంతిని పురస్కరించుకుని ప్రదానం చేసే ప్రతిష్టాత్మక కాళోజి నంది అవార్డు ను సైతం…

Read More

ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం

నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రాత్మకం పీడిత ప్రజల విముక్తికి ఐక్య పోరాటాలు అవసరం: సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా కొత్తగూడెం, సెప్టెంబర్ 10: (E6tv NEWS: ప్రతినిధి)వీరనారి చాకలి ఐలమ్మ సాగించిన అసమాన పోరాటస్ఫూర్తి చిరస్మరణీయమని, నేటి తరానికి ఆమె ఆదర్శప్రాయురాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా అన్నారు. చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా కొత్తగూడెం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో గురువారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో…

Read More

ఎమ్మెల్సీ రేసులో కాంగ్రెస్ యంగ్ లీడర్ లోకేష్ యాదవ్.. బీసీ కోటాలో లక్ కలసివచ్చేనా?

ఖమ్మం/హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. రెండు దశాబ్దాలకు పైగా విద్యార్థులు, నిరుద్యోగులు, బీసీల సమస్యలపై పోరాడుతున్న యువ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ లోకేష్ యాదవ్ పేరు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. ఎవరీ డాక్టర్ లోకేష్ యాదవ్?: సమీకరణాలు కలిసి వస్తాయా?: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభావవంతమైన బీసీ నాయకుల సంఖ్య తక్కువగా…

Read More

వ్యవసాయానికి 18 గంటలు విద్యుత్ ఇవ్వాలని వినతి

మద్నూర్‌, సెప్టెంబర్ 10: (E6tv NEWS: ప్రతినిధి) వ్యవసాయానికి రోజుకు 18 గంటలపాటు నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని సుల్తాన్‌పేట్‌ గ్రామానికి చెందిన రైతులు కోరారు. ఈ మేరకు గురువారం మేనూర్‌లోని అదనపు సహాయక ఇంజినీర్‌ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంటలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో వ్యవసాయ బోర్లపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. పంటలను కాపాడుకునేందుకు వ్యవసాయానికి కనీసం…

Read More

ఆర్య సమాజ్‌లో శ్రావణమాసం ముగింపు మహాయజ్ఞం

మద్నూర్‌, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి) మద్నూర్‌ మండల కేంద్రంలోని ఆర్య సమాజ్‌లో శ్రావణమాసం ముగింపు సందర్భంగా గురువారం మహాయజ్ఞం నిర్వహించారు. లోకకల్యాణం, ప్రజల సుఖశాంతులు, సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఏడాది శ్రావణమాసం ముగింపు అమావాస్య రోజున యజ్ఞం నిర్వహిస్తున్నట్లు ఆర్య సమాజ్‌ సభ్యులు తెలిపారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించిన మహాయజ్ఞంలో ఆర్య సమాజ్‌ సభ్యులు, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రావణమాసం సందర్భంగా చేపట్టిన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ముగింపుగా ఈ…

Read More

పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లిన వేగవంతమైన RTC బస్!

హైదరాబాద్: నగరం శివార్లలోని బాటసింగారం వద్ద గురువారం భారీ ప్రమాదం తప్పింది. వేగంగా వస్తున్న టీఎస్ ఆర్టీసీ (TSRTC) బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి, రోడ్డు పక్కనే ఉన్న పెట్రోల్ బంక్‌లోకి నేరుగా దూసుకెళ్లింది. ఈ ఘటనతో అక్కడ ఉన్న ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనలోని ప్రధాన ముఖ్యాంశాలు: డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని భావిస్తుండగా, బస్సు బంక్‌లోకి దూసుకొచ్చిన భయాందోళన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డయ్యాయి.

Read More

దొరలను గడగడలాడించిన వీర వనిత చాకలి ఐలమ్మ

ముధోల్, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).తెలంగాణ సాయుధ పోరాటంలో దొరల అరాచకాలను ఎదిరించి, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోతన్న యాదవ్ అన్నారు.ముధోల్ నియోజకవర్గ కేంద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోతన్న యాదవ్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ చూపిన తెగువ,…

Read More

వెలుగొండకు జలహారతి పట్టించిన బీజేపీ నాయకులు!

మార్కాపురం: పూలదండలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ వెలుగొండ ప్రాజెక్టు వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జలహారతి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ప్రాజెక్టును సందర్శించిన బీజేపీ నేతలు, ప్రాజెక్టు జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరప్రసాదం లాంటి ప్రాజెక్టు ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు పి.వి. కృష్ణారావు మాట్లాడుతూ… వెలుగొండ ప్రాజెక్టు కేవలం ప్రకాశం జిల్లాకే కాకుండా, పొరుగునున్న వైఎస్సార్ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు కూడా జీవనరేఖ అని కొనియాడారు. ప్రధాన…

Read More

ఓటర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన

మద్నూర్, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా మద్నూర్ తహశీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ఓటర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన శిబిరం నిర్వహించారు. వివిధ కారణాలతో నోటీసులు అందుకున్న ఓటర్లు శిబిరానికి హాజరై, తమ తల్లిదండ్రులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అధికారులకు సమర్పించారు.నోటీసుల్లో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా ఓటర్లు అందజేసిన ధ్రువీకరణ పత్రాలను అధికారులు పరిశీలించారు. ఈ ప్రక్రియలో అర్హత, పత్రాల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేస్తున్నారు. నోటీసులు అందుకున్న ఓటర్ల ధ్రువీకరణ పత్రాల…

Read More

కేటీఆర్‌, హ‌రీశ్ రావుపై కేసు నమోదు: లైంగిక వేధింపుల ఆరోపణలతో షాక్!

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మహిళా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తానీరు హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS)లోని తీవ్రమైన సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఫిర్యాదులో ఉన్న ప్రధాన ఆరోపణలు: పోలీసుల చర్యలు: మహిళా…

Read More