భారత్-అమెరికా వర్తక ఒప్పందానికి వ్యతిరేకంగా రైతుల ఆందోళన: పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తత!
చండీగఢ్: భారత్-అమెరికా ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (Trade Deal) వ్యతిరేకంగా రైతులు శనివారం చేపట్టిన ఢిల్లీ మార్చ్ ఉద్రిక్తతకు దారితీసింది. ‘దేశ్ బచావో మోర్చా’ బ్యానర్‌పై ఢిల్లీలోని మహాధర్నాకు తరలివెళ్తున్న పంజాబ్ రైతులను హర్యానా పోలీసులు పంజాబ్-హర్యానా సరిహద్దులైన శంభూ-అంబాలా, ఖనౌరీ-జింద్ వద్ద నిలిపివేశారు. సరిహద్దుల్లో ముళ్లకంచెలు, భారీ బారికేడ్లు రైతులు బస్సులు, సొంత వాహనాల్లో హర్యానాలోకి ప్రవేశించకుండా పోలీసులు మల్టీ-లేయర్ బారికేడ్లు, ముళ్లకంచెలను ఏర్పాటు చేశారు. దీనితో శంభూ-అంబాలా రహదారిని మూసివేసి, వాహనదారులకు ప్రత్యామ్నాయ…

