ఎగువన కురిసిన వర్షాలకు తెగిపోయిన ఊర చెరువు కట్ట
ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే
కల్వర్టు మరమ్మతులకు అధికారులకు ఆదేశాలు
చరవాణిలో ఇంచార్జి కలెక్టర్ తో మాట్లాడిన ఎమ్మెల్యే
కల్వర్టులను సత్వరమే మరమ్మతులు చేపట్టనున్నట్లు వెల్లడి
నష్టపోయిన పంట పొలాల రైతులకు ఆదుకుంటాం
సిరికొండ ఆగస్టు 6: (E6 tv NEWS ప్రతినిధి).
ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా సిరికొండ మండలం కొండాపూర్ ఊర చెరువు కట్ట తెగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి గురువారం కొండాపూర్ చెరువు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తొలుత కొండాపూర్- సిరికొండ మధ్య గల కల్వర్టును పరిశీలించారు. అనంతరం కొండాపూర్ ఊర చెరువు కట్ట పై కలియతిరుగుతూ.. ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం తూంపల్లి-కొండాపూర్ మధ్య గల దెబ్బతిన్న కల్వర్టు పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. కొండాపూర్ ఊర చెరువు శిఖం భూములు కబ్జాకు గురి కావడం కారణంగానే కట్ట తెగిపోవడంతో కారణమైందన్నారు. తొలుత దెబ్బతిన్న కల్వర్టులను సాధ్యమైనంత త్వరితగతిన మర్మమతులు చేపట్టాలని సంబంధింత ఇరిగేషన్ అధికారులకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.
అటు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ తో స్వయంగా చరవాణిలో మాట్లాడి.. ప్రస్తుత పరిస్థితులను వివరించారు. పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిపారు.కబ్జాకు గురైన చెరువు శిఖం భూములను సర్వే చేపట్టి మార్కింగ్ చేయాలని రెవెన్యూ , ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.కబ్జాలో ఎవరు ఉన్న ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
చెరువు కట్ట తెగిపోవడంతో ప్రభావిత ప్రాంతాల్లోని పంట పొలాలు దెబ్బతిన్నాయని పేర్కొన్న ఎమ్మెల్యే .. బాధిత రైతులకు ఆదుకుంటామని వెల్లడించారు. జరిగిన నష్టాన్ని అధికారులతో సర్వే నిర్వహించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించి పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్ల ఎర్రన్న, ఉమ్మాజి నరేష్, బాకరం రవి, మునిపల్లి సాయి రెడ్డి, చందర్ నాయక్, కొండాపూర్ సర్పంచ్ జీవన్, ఆయా గ్రామాల సర్పంచ్లు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

