Breaking News

పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ

నిజామాబాద్, ఆగస్టు 18: (E6tv NEWS: శివ ఠాకూర్).

తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్, సబ్‌-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ, యువకులకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు.నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారుల ద్వారా అందించే గూగుల్ ఫారం లింక్/క్యూఆర్ కోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

స్క్రీనింగ్ పరీక్ష

అభ్యర్థుల ఎంపిక కోసం ఆగస్టు 23, 2026 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నారు. 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది.

నిజామాబాద్ డివిజన్: విజయ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్, మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధి

ఆర్మూర్ డివిజన్: క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజ్

బోధన్ డివిజన్: జూనియర్ ఇంటర్ డిగ్రీ కాలేజ్

రెండు నెలల పాటు ఉచిత శిక్షణ

స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31, 2026 వరకు శిక్షణ అందించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు శిక్షణ కొనసాగుతుంది.రెండు నెలల శిక్షణలో భాగంగా 10 గ్రాండ్ టెస్టులు నిర్వహించడంతో పాటు, అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందించనున్నారు. ఈ కార్యక్రమం పూర్తిగా ఉచితంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని అధికారులు తెలిపారు.అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోలీస్ ఉద్యోగాల సాధనకు సన్నద్ధం కావాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు.

మరిన్ని వివరాల కోసం:
క్రాంతి: 9951943656, 8712533273

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *