Breaking News

యువతను భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ లక్ష్యం

DCC వైస్ ప్రెసిడెంట్ మమ్మాయి రమేష్

బాసర, సెప్టెంబర్ 10: (E6tv NEWS: ప్రతినిధి).

గ్రామ స్థాయి నుంచి ఎదిగిన యువతకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన యువకులను భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దడమే పార్టీ లక్ష్యమని నిర్మల్ జిల్లా DCC వైస్ ప్రెసిడెంట్ మమ్మాయి రమేష్ అన్నారు.

బాసర గ్రామానికి చెందిన సుద్దుల గంగాప్రసాద్ NSUI రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా బాసర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మమ్మాయి రమేష్ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మమ్మాయి రమేష్ మాట్లాడుతూ.. బాసరలో సాధారణ కుటుంబంలో జన్మించిన గంగాప్రసాద్ రాష్ట్ర స్థాయి పదవిని దక్కించుకోవడం అభినందనీయమన్నారు. కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తలకు సైతం సముచిత గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పిస్తూ వారిని నాయకులుగా తీర్చిదిద్దేందుకు పార్టీ కృషి చేస్తోందన్నారు.NSUI రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన గంగాప్రసాద్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మమ్మాయి రమేష్ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంజీవరావు దేశముఖ్, టౌన్ ప్రెసిడెంట్ రాజేశ్వర్ దేశముఖ్, జలీల్, జంగం రాజేందర్, నాగరాజు, శ్రీను పటేల్, శంకర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *