Breaking News

వ్యవసాయానికి 18 గంటలు విద్యుత్ ఇవ్వాలని వినతి

మద్నూర్‌, సెప్టెంబర్ 10: (E6tv NEWS: ప్రతినిధి) వ్యవసాయానికి రోజుకు 18 గంటలపాటు నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని సుల్తాన్‌పేట్‌ గ్రామానికి చెందిన రైతులు కోరారు. ఈ మేరకు గురువారం మేనూర్‌లోని అదనపు సహాయక ఇంజినీర్‌ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.

ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంటలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో వ్యవసాయ బోర్లపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు.

పంటలను కాపాడుకునేందుకు వ్యవసాయానికి కనీసం 18 గంటలపాటు విద్యుత్‌ సరఫరా చేయాలని, విద్యుత్‌ కోతలు లేకుండా చూడాలని అధికారులను కోరారు. రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, విద్యుత్‌ శాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *