కమ్మర్పల్లి, సెప్టెంబర్ 2:(E6tv NEWS: ప్రతినిధి).
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోనగిరి భాస్కర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు వైఎస్సార్ సేవలను స్మరించుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ పాలేపు నర్సయ్య, వీసీ చైర్మన్ బుచ్చన్న, మాజీ అధ్యక్షులు సుంకేట రవి, జిల్లా సెక్రటరీ శ్రీరాముల మురళి, తక్కురి దేవేందర్, తిప్పిరెడ్డి శ్రీనివాస్, బోనగిరి లక్ష్మణ్, ఇనాయత్నగర్ సర్పంచ్ రాములు, ఉపసర్పంచ్లు మనోహర్, అనిల్, ప్రసాద్, పట్టణ అధ్యక్షులు సాల్లూరి గణేష్, హాసకొత్తూరు అధ్యక్షులు శ్రీకాంత్, బషీరాబాద్ అధ్యక్షులు నర్రా భూమేష్, ఇనాయత్నగర్ భూమేష్తో పాటు సుతారి రమేష్, బుచ్చి మల్లయ్య, నిమ్మ రాజేంద్ర ప్రసాద్, గోవింద్, శేఖర్, అజార్, అరవింద్, ఉట్నూర్ నరేందర్, గోపిడి రాజేశ్వర్, శివసరం గణేష్ తదితరులు పాల్గొన్నారు.


