Breaking News

డాక్టర్ శ్రీనివాసరెడ్డిని సత్కరించిన కొత్వాల

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీలను బర్తరఫ్ చేయాలి

కొత్తగూడెం, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి)

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, కొత్తగూడెం నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్‌చార్జి డాక్టర్ మద్ది శ్రీనివాసరెడ్డిని డీసీఎంఎస్ మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు ఘనంగా సత్కరించారు. డాక్టర్ శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం వచ్చిన సందర్భంగా శుక్రవారం విద్యానగర్‌లోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుతో పాటు మరో ఎమ్మెల్సీ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. కేవలం దళితుడు అనే కారణంతో స్పీకర్‌పై వ్యాఖ్యలు చేయడం సరికాదని, బాధ్యులైన ఎమ్మెల్సీలను వెంటనే పదవుల నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దళితుల పట్ల బీఆర్‌ఎస్ నాయకులకు వివక్షాపూరిత వైఖరి ఉందని ఆరోపించారు.కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *