Breaking News

గుండెపోటుతో ఆంధ్రజ్యోతి విలేకరి ఆశన్న మృతి

పత్రికా రంగంలో విషాదం.. జర్నలిస్టులు, ప్రజాప్రతినిధుల సంతాపం

నిజాంసాగర్ ఆగస్టు 5: E6 tv NEWS ప్రతినిధి.

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలానికి చెందిన ఆంధ్రజ్యోతి విలేకరి ఆశన్న మంగళవారం ఆకస్మిక గుండెపోటుతో కన్నుమూశారు. కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.ఆశన్న మృతి వార్త తెలిసిన వెంటనే జిల్లాలోని జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ, సామాజిక సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జర్నలిజం పట్ల ఆయన చూపిన నిబద్ధత, నిజాయితీ, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించే తత్వం ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని కొనియాడారు.

పాత్రికేయ వృత్తిలో బాధ్యతాయుతంగా సేవలందించిన ఆశన్న అకాల మరణం పత్రికా రంగానికి తీరని లోటని పేర్కొంటూ పలువురు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.అలాగే దివంగత ఆశన్న ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, స్నేహితులు ప్రార్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *