Breaking News

మద్నూర్ మండల TSCPSEU నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

మద్నూర్, ఆగస్టు 21: (E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) మద్నూర్ మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మండల అధ్యక్షుడిగా వి. భీమ్‌రావు, ప్రధాన కార్యదర్శిగా కే. లక్ష్మణ్, కోశాధికారిగా పి. సురేష్ ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్. దశరథ్, వైస్ ప్రెసిడెంట్లుగా సంపత్‌రెడ్డి, ఎస్. రాజు, సెక్రటరీలుగా పి. శ్రీనివాస్, టీ. విజయ్, కే. రాజు ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పనిచేయాలని, ముఖ్యంగా పాత పెన్షన్ విధానం (OPS) సాధన కోసం కొనసాగుతున్న ఉద్యమంలో నూతన కార్యవర్గం కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించారు.ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘటితంగా పోరాడుతూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కుంట ఎల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ బావేతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *