Breaking News

ప్రైమ్ ల్యాబ్ క్లినికల్ లేబొరేటరీ ప్రారంభం

నిర్మల్, ఆగస్టు 10: (E6 tv NEWS (Md. అమీరుద్దీన్).

నిర్మల్ పట్టణంలో ప్రైమ్ ల్యాబ్ క్లినికల్ లేబొరేటరీని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెరుగైన వైద్యం అందించడంలో రక్త పరీక్షలు ఎంతో కీలకంగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వ్యాధులను ముందుగానే గుర్తించి తగిన చికిత్స పొందేందుకు వైద్యుల సూచనల మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ముందస్తు పరీక్షల ద్వారా అనారోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు.

ల్యాబ్ నిర్వాహకుడు ఎం.డి. అనస్ అనస్ ఉద్దీన్ మాట్లాడుతూ.. ప్రజలు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు జాగ్రత్తగా అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు ల్యాబొరేటరీలో తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఇమ్రాన్ ఉల్లా, జాకీర్, కత్తి నరేందర్, ఖిజర్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *