Breaking News

కుంటాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌కు రూ.9 కోట్ల నిధులు

కుంటాల, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి).

కుంటాల మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా మార్చేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేసిందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.9 కోట్ల నిధులు మంజూరు చేసిందని ఆయన వెల్లడించారు.

ఈ నిధులతో పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు అవసరమైన ఇతర సౌకర్యాలను మెరుగుపరచనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ అందుబాటులోకి రావడంతో విద్యార్థులు ప్రాథమిక విద్య నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే పాఠశాలలో విద్యనభ్యసించే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.

పబ్లిక్ స్కూల్ ఏర్పాటుతో కుంటాల మండలంతో పాటు పరిసర ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్‌కు నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *