బోధన్, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి).
ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) బోధన్‌లో ఉర్దూ విభాగం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రలను పోషిస్తూ వివిధ తరగతుల్లో బోధనా కార్యక్రమాలను నిర్వహించారు.కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. సురేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి. సత్య వర ప్రసాద్‌తో పాటు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తరగతి గదుల్లో బోధన చేపట్టి తమ ప్రతిభను చాటుకున్నారు.ఈ వినూత్న కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, బోధనా నైపుణ్యాలు, బాధ్యతాయుతమైన భావన పెంపొందడంతో పాటు ఉపాధ్యాయుల పట్ల గౌరవభావం మరింత బలపడిందని కళాశాల నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. సురేష్ మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల సేవలు ఎంతో ప్రాధాన్యమైనవని పేర్కొన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రలను పోషించడం వినూత్నమైన, ప్రయోజనకరమైన విద్యా కార్యక్రమమని అభినందించారు.
కార్యక్రమంలో ఆర్థిక శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రబీనా కౌసర్, ఇంగ్లీష్ విభాగం మహమ్మద్ అఫ్జల్, రాజకీయ శాస్త్ర విభాగం అబ్దుల్ సత్తార్, ఉర్దూ విభాగం కన్వీనర్ మహమ్మద్ ముదస్సిరుద్దీన్‌తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.ఉపాధ్యాయుల పాత్రలను సమర్థవంతంగా పోషించిన విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్య, విజ్ఞానం, నైతిక విలువలు, క్రమశిక్షణతో సమాజ అభివృద్ధికి కృషి చేస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. దీంతో కార్యక్రమం ఉత్సాహభరితమైన వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

