ఎద్దులను అలంకరించి పూజలు నిర్వహించిన కాశినాథ్ పటేల్ కుటుంబం
మద్నూర్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి)
మండలంలోని సోమూర్ గ్రామంలో ఎడ్ల అమావాస్య (పొలాల పండుగ)ను కాశినాథ్ పటేల్ కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. వ్యవసాయంలో రైతులకు తోడుగా నిలిచే ఎద్దులను రంగురంగుల వస్త్రాలు, తోరణాలు, వివిధ అలంకరణలతో ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎద్దులకు ఆరోగ్యం, రైతులకు పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని పూజలు చేశారు. వ్యవసాయంతో విడదీయరాని అనుబంధం కలిగిన పశువుల పట్ల కృతజ్ఞతను చాటుతూ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.ఎడ్ల అమావాస్య పల్లె జీవన విధానానికి, వ్యవసాయ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని కాశినాథ్ పటేల్ తెలిపారు. ఈ సంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు కూడా కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో కాశినాథ్ పటేల్, రామ్ పటేల్, లక్ష్మణ్ పటేల్, వసంత్ పటేల్, పవన్ కుమార్‌తో పాటు గ్రామస్థులు, రైతులు పాల్గొన్నారు.



