శాస్త్రోక్తంగా నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం
జంధ్యాల పౌర్ణమి వేడుకలు
ఏర్గట్ల, ఆగస్టు 28:(E6tv NEWS: ప్రతినిధి).
బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండల కేంద్రంలో శ్రీ శివమార్కండేయ మాతృ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జంధ్యాల పౌర్ణమి (నూతన యజ్ఞోపవీత ధారణ) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వేద పండితులు జంధ్యాల పౌర్ణమి విశిష్టతను వివరించారు. ఆధ్యాత్మిక సంప్రదాయాలను, సంస్కృతి, ఆచారాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.భక్తిశ్రద్ధలతో జరిగిన జంధ్యాల పౌర్ణమి వేడుకలతో ఏర్గట్ల మండల కేంద్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సంఘం సభ్యులు, భక్తులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.


