Breaking News

నిరుపేద కుటుంబానికి అండగా జమ్మికుంట 6వ వార్డు కౌన్సిలర్

జమ్మికుంట, ఆగస్టు 12: (E6 tv NEWS: ప్రతినిధి).

ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ జమ్మికుంట 6వ వార్డు కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సీర్ల అనిత రాణి అనారోగ్యంతో మృతి చెందగా, ఆమె అంతిమయాత్రలో కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ పాల్గొన్నారు.హౌసింగ్ బోర్డు కాలనీలో సుమారు 30 సంవత్సరాలుగా అద్దెకు ఉంటున్న సీర్ల అనిత రాణి ప్రైవేట్ నర్సుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు మూడు రోజుల క్రితం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆమె మృతి చెందారు.

నిరుపేద కుటుంబానికి చెందిన అనిత రాణి అంత్యక్రియలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా ఆమె కుమారులు గోపి, సాయిలకు దహన సంస్కారాల ఖర్చుల కోసం కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ రూ.5,000 ఆర్థిక సహాయం అందించారు.ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి తన వంతు సహాయం అందిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటున్న కౌన్సిలర్ సేవలను 6వ వార్డు ప్రజలు అభినందించారు. ప్రతిరోజూ ఉదయం వార్డులో పర్యటిస్తూ ప్రజల సమస్యలు, క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటూ అవసరమైన వారికి అండగా నిలుస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *