Breaking News

గంగ తెప్ప మహోత్సవంలో తొర్తి గంగపుత్ర సంఘం సభ్యులు

ఏర్గట్ల,సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి).

హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌లోని హుస్సేన్‌సాగర్‌ తీరంలో నిర్వహించిన గంగ తెప్ప మహోత్సవంలో ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన గంగపుత్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని సంఘం అధ్యక్షుడు తొపారం రాజేశ్వర్‌ తెలిపారు.

గంగపుత్రుల సంప్రదాయాలు, సంస్కృతి, ఐక్యతను చాటేలా నిర్వహించిన ఈ మహోత్సవంలో వివిధ ప్రాంతాల నుంచి గంగపుత్ర సంఘాల ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొర్తి గంగపుత్ర సంఘం సభ్యులు ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొని గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం తొర్తి గంగపుత్ర సంఘం సభ్యులను మహోత్సవ నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. గంగపుత్రుల సంప్రదాయాలు, ఆచారాలను పరిరక్షిస్తూ భావితరాలకు అందించేలా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని సంఘ సభ్యుడు తొపారం రాజేష్‌ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తొర్తి గంగపుత్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *