Breaking News

పెద్ద ఎక్లారలో 200 ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ సిబ్బంది

మద్నూర్, ఆగస్టు 22: (E6tv NEWS: ప్రతినిధి).

వన మహోత్సవంలో భాగంగా మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లార గ్రామంలో శనివారం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 200 ఈత మొక్కలు నాటారు. బిచ్కుంద ఆబ్కారీ శాఖ, గౌడ సంఘం, గ్రామస్థుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.జిల్లా ఆబ్కారీ అధికారి ఈఎస్ ముకుందరెడ్డి ఆదేశాల మేరకు మొక్కలు నాటినట్లు ఎక్సైజ్ ఎస్ఐ నాగేష్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఈత చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడమే కార్యక్రమం లక్ష్యమన్నారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది దేవీసింగ్, రమేష్, గౌడ సంఘం సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *