Breaking News

గణేష్ మండపాల వద్ద విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి

గణేష్ ఉత్సవాల సన్నాహక సమావేశంలో సమస్యలను ప్రస్తావించిన బిచ్కుంద ప్రతినిధులు

కామారెడ్డి, ఆగస్టు 31:(E6tv NEWS: ప్రతినిధి).
రాబోయే వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల సన్నాహక సమావేశం నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గణేష్ మండపాల నిర్వాహకులు, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బిచ్కుంద మండలం నుంచి సమావేశానికి హాజరైన శెట్పల్లి విష్ణు గణేష్ మండపాల వద్ద ఎదురయ్యే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా మండపాల వద్ద విద్యుత్ కనెక్షన్లు, విద్యుత్ సరఫరా, వైరింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ సూచనలు, నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించాలని సమావేశంలో సూచించారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.బిచ్కుంద మండలం నుంచి ఎస్‌ఐ రాజు ఆదేశాల మేరకు ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బొమ్మల లక్ష్మణ్, గోపాల్ రెడ్డి, కొట్టం సుధాకర్, నాగంవార్ నగేష్, కొట్టం అఖిల్, హన్మాండ్లు, బుడల చరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *