Breaking News

శిరీష కుటుంబానికి కల్వకుంట్ల కవిత పరామర్శ

నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్

ములకలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:(E6tv NEWS: ప్రతినిధి).

హైదరాబాద్‌లో ఇటీవల హత్యకు గురైన నర్స్ ఊకె శిరీష కుటుంబ సభ్యులను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ములకలపల్లి మండలం చౌటిగూడెంలో శిరీష కుటుంబాన్ని కలిసి ఆమె తల్లి, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.శిరీష మృతిపై కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకున్న కవిత.. ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శిరీషను హత్య చేసిన నిందితులను గుర్తించి, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. శిరీష కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *