Breaking News

జుక్కల్ కేజీబీవీలో విద్యార్థినులకు ప్లేట్లు, గ్లాసులు, చెంచాల పంపిణీ

బస్వాపూర్ (కామారెడ్డి జిల్లా): E6 tv NEWS.

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) మరియు జూనియర్ కళాశాల విద్యార్థినులకు గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొండ ఆధ్వర్యంలో ప్లేట్లు, గ్లాసులు, చెంచాలను పంపిణీ చేశారు.విద్యార్థినుల రోజువారీ అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనానికి అవసరమైన పాత్రలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమణ సురేష్ గొండ మాట్లాడుతూ విద్యార్థినులు చదువును భారంగా కాకుండా ఇష్టంగా భావించి, కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.

అలాగే తల్లిదండ్రులు, విద్యను బోధించే ఉపాధ్యాయుల ఆశయాలను నెరవేర్చేలా క్రమశిక్షణతో చదువుకొని పాఠశాల, కళాశాల ప్రతిష్ఠను పెంచాలని విద్యార్థినులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జి ప్రత్యేక అధికారి హేమలత, పేరెంట్స్ కమిటీ చైర్మన్, ఐకేపీ వీవో భాస్కర్, బస్వాపూర్ కారోబార్ గంగారాం, యదు మేస్త్రితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *