బిచ్కుంద, ఆగస్టు 16: (E6tv NEWS: ప్రతినిధి).
జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద పట్టణంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారి కుమార్తె జోనిట–దాస్ వివాహ ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి హాజరై కాబోయే వధూవరులు జోనిట–దాస్‌లను ఆశీర్వదించి, వివాహ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వివాహ విందులో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.



అలాగే ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తదితరులు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖులు వివాహ వేడుకలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా పలువురు రాష్ట్రస్థాయి నాయకులు హాజరు కావడంతో బిచ్కుందలో సందడి నెలకొంది.వధూవరులు జోనిట–దాస్‌లకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.

