Breaking News

22-A భూముల అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా? కాంగ్రెస్ నాయకులకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి సవాల్

ఇందూరు, ఆగస్టు 23: (E6tv NEWS: శివ ఠాకూర్).

22-A భూముల అంశంపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. ఇందూరు జిల్లాలో ఎక్కడికి రమ్మన్నా తాను అక్కడికి వచ్చి చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.నిజామాబాద్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ.. 22-A భూముల అంశంపై పూర్తి అవగాహన, విషయ పరిజ్ఞానం ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరైనా చర్చకు రావచ్చన్నారు. తాను అన్ని విషయాలను ఆధారాలతో సహా వివరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

22-A భూముల అంశంపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. ఇందూరు జిల్లాలో ఎక్కడికి రమ్మన్నా తాను అక్కడికి వచ్చి చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.నిజామాబాద్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ.. 22-A భూముల అంశంపై పూర్తి అవగాహన, విషయ పరిజ్ఞానం ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరైనా చర్చకు రావచ్చన్నారు. తాను అన్ని విషయాలను ఆధారాలతో సహా వివరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

కాంగ్రెస్ నాయకులకు ఈ అంశంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఒకవేళ చర్చకు రాకపోతే రాష్ట్ర పార్టీ సూచన మేరకు 22-A భూముల సమస్యపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామాను డిమాండ్ చేస్తామని పేర్కొన్నారు.

పేద ప్రజలకు 22-A భూముల వల్ల జరుగుతున్న నష్టాన్ని, వారి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు మెమోరాండం ఇవ్వడానికి వచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ప్రతి రాజకీయ పార్టీకి ఉన్న హక్కు అని, అలాంటి సమయంలో పోలీసుల వ్యవహారం సముచితం కాదన్నారు.కాంగ్రెస్ నాయకులు గుండాల్లా వ్యవహరించడం మానుకోవాలని, వీడియోలు విడుదల చేసి విమర్శలు చేయడం కాకుండా ప్రజల సమస్యలపై బహిరంగ చర్చకు రావాలని దినేష్ పటేల్ కులాచారి సూచించారు.22-A భూముల విషయంలో పేదలకు జరుగుతున్న నష్టాన్ని ప్రజల ముందుకు తీసుకురావడమే బీజేపీ లక్ష్యమని, ఈ అంశంపై ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దాంపల్లి జ్యోతి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు యాదల నరేష్, బెల్లల్ శశాంక్, జగదీష్ కులకర్ణి, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు ఓం సింగ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మారెడ్డి వనిత, యువ మోర్చా అధ్యక్షుడు వంశీ గౌడ్, యువ మోర్చా రాష్ట్ర కో-కోశాధికారి అమంద్ విజయ్ కృష్ణ, బీజేపీ నాయకులు ఎస్.ఆర్. సత్యపాల్, నాయిడి రాజన్న, మండల అధ్యక్షులు ఆనంద్ రావు, జగన్ రెడ్డి, ఆనంద్, రాకేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దాంపల్లి జ్యోతి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు యాదల నరేష్, బెల్లల్ శశాంక్, జగదీష్ కులకర్ణి, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు ఓం సింగ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మారెడ్డి వనిత, యువ మోర్చా అధ్యక్షుడు వంశీ గౌడ్, యువ మోర్చా రాష్ట్ర కో-కోశాధికారి అమంద్ విజయ్ కృష్ణ, బీజేపీ నాయకులు ఎస్.ఆర్. సత్యపాల్, నాయిడి రాజన్న, మండల అధ్యక్షులు ఆనంద్ రావు, జగన్ రెడ్డి, ఆనంద్, రాకేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *