జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహానికి ఆహ్వానం
మర్యాదపూర్వకంగా ఆహ్వానాన్ని స్వీకరించిన ఐపీఎస్ రాజేష్ చంద్ర
కామారెడ్డి, ఆగస్టు 7: (E6 tv NEWS ప్రతినిధి).
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ మహోత్సవానికి ఆహ్వానిస్తూ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ శుక్రవారం ఐపీఎస్ అధికారి శ్రీ రాజేష్ చంద్రను వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా ఐపీఎస్ రాజేష్ చంద్ర ఆహ్వానాన్ని సాదరంగా స్వీకరించి, వివాహ వేడుక విజయవంతంగా జరగాలని ఆకాంక్షిస్తూ నూతన వధూవరులకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.ఈ భేటీ ఆత్మీయ వాతావరణంలో జరగగా, పరస్పరం పలకరించుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

