Breaking News

మేనూర్‌లో ఘనంగా అన్నాభౌ సాఠే 106వ జయంతి వేడుకలు

మద్నూర్, ఆగస్టు 23: (E6tv NEWS: ప్రతినిధి).

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ గ్రామంలో ఆదివారం సాహిత్య రత్న, లోక్‌షాహిర్ డాక్టర్ అన్నాభౌ సాఠే 106వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నాభౌ సాఠే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. డాక్టర్ అన్నాభౌ సాఠే సామాజిక సమానత్వం, దళితుల హక్కులు, కార్మికుల సంక్షేమం కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడని కొనియాడారు. ఆయన రచనలు, పాటలు, ప్రజా చైతన్య కార్యక్రమాలు సమాజంలోని అణగారిన వర్గాలకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్నారు. అన్నాభౌ సాఠే ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు భూమయ్య, ఉపాధ్యక్షుడు విశ్వనాథ్, ఉప సర్పంచ్ మల్లయ్య, అవినాష్, చందర్, లక్ష్మణ్, హనుమంత్, గంగాధర్, చంద్రకాంత్, మాజీ సర్పంచ్ విట్టల్ గురుజీ, విట్టల్ సెట్, భీమ్రావు, పటేల్ జూబ్రి సంజు తదితరులతో పాటు మహిళలు, చిన్నారులు, కుల పెద్దలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *