Breaking News

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్

సదాశివనగర్, ఆగస్టు 1: E6 tv NEWS.

ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అశోక్ గార్డెన్లో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పాల్గొని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ, ప్రజాసేవలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మరిన్ని విజయాలు సాధించాలని, ప్రజల ఆదరణను మరింతగా పొందాలని ఆకాంక్షించారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలు, ఐశ్వర్యం, శాంతి-సమృద్ధులతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని శుభాకాంక్షలు తెలిపారు.ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *