నిర్మల్, ఆగస్టు 18: (Etv NEWS,A. తిరుపతి గౌడ్).
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గౌడజన హక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జయంతి సభ నిర్వహించారు.కార్యక్రమానికి మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు, టీజీఎస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ మాజీ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మున్సిపల్ కౌన్సిలర్లు కత్తి నరేందర్, మంచాల శ్రీకాంత్ యాదవ్, దళిత సంఘాల జేఏసీ రాష్ట్ర నాయకులు ముడుసు సత్యనారాయణ, మాదిగల అంబేద్కర్ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నిగులపు లింగన్న, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు అనుముల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమరవేణి నర్సాగౌడ్ మాట్లాడుతూ.. దేశంలో దళిత, బహుజన వర్గాల హక్కుల కోసం ఐక్య ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు ఐక్యంగా ఉద్యమించి జనాభా దామాషా ప్రకారం రాజకీయ, ఉద్యోగ, విద్య, వైద్యం, ఉపాధి తదితర రంగాల్లో తమ వాటాను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.
“మేమెంత మంది.. మాకంత వాటా” అనే నినాదంతో హక్కుల సాధన కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని నర్సాగౌడ్ అన్నారు. సర్వాయి పాపన్న జయంతి వారోత్సవాల సాక్షిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలను ఐక్యం చేసి హక్కుల సాధన కోసం ఐక్య ఉద్యమాన్ని నిర్మిస్తామని స్పష్టం చేశారు.బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని దూరం చేస్తున్న ఆధిపత్య విధానాలకు ఇక కాలం చెల్లిందని అన్నారు. రాబోయే రోజుల్లో బీసీ, దళిత, బహుజన వర్గాల హక్కులు, ఆశయాల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాల సాధన కోసం బడుగు, బలహీన వర్గాల ప్రజలంతా ఐక్యంగా పోరాడి సామాజిక, రాజకీయ హక్కులను సాధించుకున్నప్పుడే పాపన్నకు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని నర్సాగౌడ్ పేర్కొన్నారు.కార్యక్రమంలో మోకుదెబ్బ రాష్ట్ర నాయకులు పడాల రాజేందర్ గౌడ్, తీగల వెంకట్ గౌడ్, కొండ బాల గౌడ్, జిల్లా నాయకులు యాగండ్ల దశ గౌడ్, కొండ మురళి గౌడ్, నాగుల నారాయణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, దేవేందర్ గౌడ్, వేణు గౌడ్, గణేష్ గౌడ్, పి. రాజు గౌడ్, కాల్వ సత్యనారాయణ గౌడ్, నాగుల అయ్యన్న గౌడ్, తిరుమల సురేష్ గౌడ్, తోట రాజ్ కుమార్ గౌడ్, తిరుపతి గౌడ్, మధు గౌడ్, వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

