ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు
ఏర్గట్ల, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).
ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన రాయన గంగాధర్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో వైద్య ఖర్చుల కోసం తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్‌కుమార్ దృష్టికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు.
దీనిపై స్పందించిన ఈరవత్రి అనిల్‌కుమార్ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.1.25 లక్షల ఎల్‌ఓసీని మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు. ఆపద సమయంలో తమకు అండగా నిలిచి వైద్య సహాయం అందించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఈరవత్రి అనిల్‌కుమార్‌కు రాయన గంగాధర్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రవిరెడ్డి, రెండ్ల రమేష్, జూంగాల గణేష్, ఎండీ మునీర్, దొబ్బల మహేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

