Breaking News

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై విద్యార్థినుల తల్లిదండ్రులకు అవగాహన

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై విద్యార్థినుల తల్లిదండ్రులకు అవగాహన

మద్నూర్, ఆగస్టు 08: E6 tv NEWS (M, మస్నాజీ).
మద్నూర్ ఏపిహెచ్‌సీ డోంగ్లీ ఆధ్వర్యంలో మద్నూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినుల తల్లిదండ్రులకు హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సినేషన్‌పై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రాముఖ్యత, వ్యాక్సిన్‌కు అర్హత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సిబ్బంది విద్యార్థినుల తల్లిదండ్రులకు వివరించారు. వ్యాక్సినేషన్‌కు అర్హులైన 20 మంది విద్యార్థినులకు సంబంధిత పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో మద్నూర్ ఏఏఎం, ఏపిహెచ్‌సీ డోంగ్లీ వైద్య సిబ్బంది, కస్తూర్బా గాంధీ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినుల తల్లిదండ్రులు, ఆశా కార్యకర్తలు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *