Breaking News

SIR ఫేజ్–2పై BLAలు, సూపర్వైజర్లకు శిక్షణ

మోర్తాడ్, ఆగస్టు 30:(E6tv NEWS: ప్రతినిధి).

బాల్కొండ నియోజకవర్గ స్థాయి BLAలు (బూత్ లెవెల్ ఏజెంట్లు), BLA సూపర్వైజర్లకు SIR ఫేజ్–2పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని RNB ఫంక్షన్ హాల్‌లో ఈ సమావేశం జరిగింది.కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్, SIR ఇంచార్జ్ ఊట్ల వరప్రసాద్ హాజరై BLAలు, సూపర్వైజర్లకు SIR ప్రక్రియపై అవగాహన కల్పించారు.

SIR ఫేజ్–2లో భాగంగా నోటీసులు అందుకున్న ప్రతి ఓటరు BLO ఎదుట ఎన్నికల కమిషన్ సూచించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదానితో హాజరయ్యేలా BLAలు, సూపర్వైజర్లు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు ప్రక్రియలో పాల్గొనేలా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, BLAలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *