Breaking News

భీంగల్‌లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం

6వ వార్డులో మురికి కాలువల శుభ్రత పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్

నీటి సంరక్షణకు ప్రజలకు పిలుపు

భీంగల్, ఆగస్టు 5: E6 tv NEWS (తాటికొండ గంగాధర్).

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్య పరిరక్షణతో పాటు నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణవ్యాప్తంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అన్ని వార్డుల్లో మురికి కాలువల శుభ్రపరిచే పనులు, చెత్త తొలగింపు, నిల్వ నీరు లేకుండా చర్యలు చేపడుతుండగా, ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్య పరిరక్షణతో పాటు నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణవ్యాప్తంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అన్ని వార్డుల్లో మురికి కాలువల శుభ్రపరిచే పనులు, చెత్త తొలగింపు, నిల్వ నీరు లేకుండా చర్యలు చేపడుతుండగా, ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా 6వ వార్డులో జరుగుతున్న మురికి కాలువల శుభ్రత పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి, మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ పరిశీలించారు. పారిశుద్ధ్య సిబ్బంది పనులను నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. వర్షాల కారణంగా డెంగ్యూ, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

అదే సందర్భంగా భీంగల్ మున్సిపల్ పరిధిలో ‘ప్రతి ఇంటా ఇంకుడు గుంత’ నిర్మాణంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో వర్షాభావ పరిస్థితులు కొనసాగితే తీవ్ర నీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నందున ప్రతి ఇంటిలో తప్పనిసరిగా ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని ప్రజలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న 2వ వార్డు కౌన్సిలర్  అనంతరావు కుశలత మాట్లాడుతూ, భూగర్భ జలాల పెంపుదలకు ఇంకుడు గుంతలు ఎంతో ఉపయోగపడతాయని, నీటిని వృథా చేయకుండా ప్రతి కుటుంబం బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మహిళా సంఘాల సభ్యులు, వార్డు ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా మున్సిపల్ వాహనాలకు మాత్రమే అందజేయాలని, అలాగే ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలను నిర్మించి వర్షపు నీటిని సంరక్షించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, నీటి సంరక్షణలో ఆదర్శవంతమైన భీంగల్ పట్టణాన్ని నిర్మించవచ్చని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తూ, తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా మున్సిపల్ వాహనాలకు మాత్రమే అందజేసి మున్సిపాలిటీకి సహకరించాలని కోరారు. ప్రజల సహకారంతోనే పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భీంగల్ పట్టణాన్ని నిర్మించగలమని వారు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *