Breaking News

చెన్నమ్మ కోరి దేవస్థానంలో భక్తుల సందడి

మద్నూర్, ఆగస్టు 29:(E6tv NEWS: ప్రతినిధి).

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం కుర్చీర్ గ్రామంలోని కోడిచీర శివారులో వెలసిన చెన్నమ్మ కోరి దేవస్థానంలో శ్రావణ శనివారం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. చిన్న ఎక్లార గ్రామస్తులు, భక్తుల ఆధ్వర్యంలో దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు దేవస్థానానికి చేరుకుని చెన్నమ్మ కోరి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం శ్రీ 108 మల్లికార్జున్ శివాచార్య మహారాజ్ (ఖత్‌గావ్‌కర్) ఆధ్వర్యంలో ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక విషయాలపై భక్తులకు సందేశాన్ని అందించారు.భక్తులు భక్తిశ్రద్ధలతో కార్యక్రమాల్లో పాల్గొనడంతో దేవస్థాన పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గ్రామస్తులు, భక్తులు సహకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *