Breaking News

ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.1 లక్ష ఎల్‌ఓసీ అందజేత

అనారోగ్యంతో బాధపడుతున్న రాజన్నకు అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్

బాల్కొండ, ఆగస్టు 3: E6 tv NEWS (తాటికొండ గంగాధర్).

నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన సాట్లపల్లి రాజన్న (తండ్రి: గంగారం) అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు శస్త్రచికిత్స చేయాల్సిందిగా సూచించడంతో కుటుంబ సభ్యులు వైద్య సహాయం కోసం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ను సంప్రదించారు.విషయాన్ని వెంటనే స్పందించిన ముత్యాల సునీల్ కుమార్, ముఖ్యమంత్రి సహాయ నిధి (CM Relief Fund) నుంచి రూ.1,00,000 విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC) మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి అండగా నిలవడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.వైద్య చికిత్సకు అవసరమైన ఆర్థిక సాయం అందడంతో రాజన్న కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ, క్లిష్ట సమయంలో అండగా నిలిచిన ముత్యాల సునీల్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *