Breaking News

తాణకాలాన్‌లో అంగరంగ వైభవంగా ఎడ్ల పొలాల అమావాస్య

ఎడ్లకు, ట్రాక్టర్లకు ప్రత్యేక అలంకరణలు.. గ్రామంలో పండుగ సందడి

ఎడపల్లి, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).
ఎడపల్లి మండలం తాణకాలాన్ గ్రామంలో ఎడ్ల పొలాల అమావాస్య వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోవడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

ఎడ్ల పొలాల అమావాస్యను పురస్కరించుకుని రైతులు తమ ఎడ్లను, ట్రాక్టర్లను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వ్యవసాయంలో తమకు తోడుగా నిలిచే పశువులు, వ్యవసాయ యంత్రాలకు పూజలు చేసి తమ సంప్రదాయాన్ని చాటుకున్నారు. చిన్నారులు, యువత, మహిళలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొనడంతో గ్రామంలో సందడి నెలకొంది.

గ్రామ ప్రజలు ఐకమత్యంతో సంప్రదాయాలను కొనసాగిస్తూ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గెంటే అలేఖ్య శ్రీనివాస్ యాదవ్, ఉప సర్పంచ్ చింతలవారి రవి, మాజీ సర్పంచ్ పాల్డా భాస్కర్‌రెడ్డి, మోపాల కమలాకర్‌రెడ్డి, చెల్లెడి చిన్నారెడ్డి, గుండా శ్రీనివాస్, ఆకుల సురేష్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *