Breaking News

టీజీఎన్‌-ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్‌లో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశం

NATS 2.0 పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు

ఆగస్టు 10, 2026 వరకు గడువు

నిజామాబాద్, ఆగస్ట్ 4: E6 tv NEWS (శివ ఠాకూర్).

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎన్‌ఎస్-ఆర్టీఎస్) నిజామాబాద్ రీజియన్‌లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రీజినల్ మేనేజర్ ఎన్. విజయకృష్ణ మూర్తి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.రీజియన్ పరిధిలోని డీజీఎం (ఇంజినీరింగ్), కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్ విభాగాలతో పాటు B.Com, B.Sc, BBA, BCA, B.A తదితర గ్రాడ్యుయేట్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అప్రెంటిస్‌కు అర్హులని తెలిపారు.

అభ్యర్థులు NATS 2.0 (https://nats.education.gov.in) పోర్టల్‌లో నమోదు చేసుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2022 సంవత్సరం లేదా ఆ తర్వాత ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే అర్హులు అని పేర్కొన్నారు.

దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 1 నుంచి ప్రారంభమై, ఆగస్టు 10, 2026 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఎంపిక పూర్తిగా విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా జరుగుతుందని, ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదని వెల్లడించారు.ఈ నియామక ప్రక్రియ ద్వారా 13 డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు, 5 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు రీజినల్ మేనేజర్ తెలిపారు.అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గడువు తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని టీజీఎన్‌ఎస్-ఆర్టీఎస్ నిజామాబాద్ రీజియన్ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *