Breaking News

మద్నూర్ మండల సమాఖ్య నూతన పాలకవర్గం ఎన్నిక

మద్నూర్, ఆగస్టు 22: (E6tv NEWS: ప్రతినిధి).

మద్నూర్ మండల సమాఖ్య సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ఆడిట్ చేయించి, ఆడిట్ నివేదికను సర్వసభ్య సమావేశంలో ఆమోదించారు. గత ఆర్థిక సంవత్సరంలో మండల సమాఖ్యకు రూ.5,86,413 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మద్నూర్ మండల ఎంపీడీవో పి. సాయిలు పాల్గొని మండల సమాఖ్య సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. మండలంలోని మహిళలందరూ స్వయం సహాయక సంఘాల్లో చేరాలని, ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆర్థికంగా ఎదగాలని సూచించారు.అనంతరం మద్నూర్ మండల సమాఖ్య నూతన పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా తడి హిప్పర్గ గ్రామ సంఘానికి చెందిన షేక్ హసీనా బేగం, కార్యదర్శిగా మద్నూర్ తెలంగాణ బతుకమ్మ గ్రామ సంఘానికి చెందిన పాంచల్ ప్రేమల, కోశాధికారిగా రుసేగావ్ గ్రామ సంఘానికి చెందిన అనీసా బేగంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సమావేశంలో ఉమ్మడి మద్నూర్ మండలంలోని వివిధ గ్రామ సంఘాల అధ్యక్షురాళ్లు, సీసీలు, అకౌంటెంట్ నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *