రీజినల్ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళి
తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ సేవలను స్మరించిన అధికారులు
పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఆర్టీసీ అధికారులు, సిబ్బంది
నిజామాబాద్, ఆగస్టు 6: (E6 tv NEWS, శివ ఠాకూర్)
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) నిజామాబాద్ రీజినల్ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన, సమాజాభివృద్ధికి ఆచార్య జయశంకర్ అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు.కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ పి. జ్యోతి, పర్సనల్ ఆఫీసర్ పద్మజ తో పాటు రీజినల్ కార్యాలయానికి చెందిన అధికారులు, సూపర్వైజర్లు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా, ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆచార్య జయశంకర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. అనంతరం ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజాసేవలో ముందుకు సాగాలని ప్రతిజ్ఞ చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

