Breaking News

జోనిట వివాహ విందుకు మారేపల్లి గ్రామ ప్రజలకు ఆత్మీయ ఆహ్వానం

డోంగ్లీ, ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి)

డోంగ్లీ మండలం మారేపల్లి గ్రామ ప్రజలకు స్థానిక సర్పంచ్ గాయక్వాడ్ శ్రీధర్ ఆత్మీయ ఆహ్వానం పలికారు. జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు కుమార్తె జోనిట వివాహ విందు కార్యక్రమం ఆగస్టు 16, 2026 ఆదివారం రోజున డీబీఎల్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా మారేపల్లి గ్రామ ప్రజలందరూ వివాహ విందు కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని సర్పంచ్ శ్రీధర్ కోరారు. నూతన దంపతుల దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ, తమ ఆశీస్సులు అందించాలని గ్రామ ప్రజలకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేశారు.ఈ ఆత్మీయ ఆహ్వాన కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్ష్మణ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *